బిగ్ బాస్ సీజన్ 3 పన్నెండో ఎపిసోడ్ కి ఎంటర్ అయింది. లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని సాధించిన కంటెస్టెంట్స్ ఒకవైపు ఆనందంలో ఉంటే.. జైలు పాలైన వరుణ్ సందేశ్.. తమన్నాలు విషాదంలో ఉన్నారు.

ఇక గురువారం ఎపిసోడ్ హైలైట్స్ విషయానికొస్తే.. వరుణ్ సందేశ్ తన బిహేవియర్ బాలేకపోవడంతో రియలైజ్ అయ్యి తనకు తానుగా జైలుకి వెళ్లాడని హిమజ, శివజ్యోతితో మాట్లాడుతుండగా.. వితికాకి కోపం వచ్చింది. తన భర్త ప్రవర్తన బాలేదని నువ్ ఎలా అంటావంటూ హిమజతో వాదనకి దిగింది.

ఈ విషయాన్ని తన భర్త వరుణ్ సందేశ్ కి చేరవేసింది వితికా.. అది విన్న వరుణ్ వాళ్లతో డిస్కషన్ పెట్టకని సర్ద్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై కల్పించుకున్న అలీ.. హిమజతో వాదనకు దిగారు. తన తప్పుచేసి జైలుకి వెళ్లాడనే మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ హిమజకి చురకలేసే ప్రయత్నం చేశారు.

అయితే అతడి ప్రయత్నాన్ని తిప్పికొడుతూ 'నువ్ నన్ను కావాలంటే ఎలిమినేట్ చేసుకోగానీ.. తప్పుగా కన్వే చేయకని' హిమజ.. అలీతో చెప్పింది. మధ్యలో పునర్నవి ఇన్వాల్వ్ అవ్వడంతో ఆమెపై హిమజ ఫైర్ అయింది.