ప్రతివారం నామినేట్ అవుతూ నామినేషన్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు గణేష్. అయితే ఆడియన్స్ అతడి సేవ్ చేస్తుండడం, అదృష్టం కలిసి రావడంతో అతడు ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు. కానీ హౌస్ లో అతడు కౌశల్ తో ప్రవర్తించిన తీరు కారణంగా కౌశల్ ఆర్మీ అతడిని టార్గెట్ చేసింది

బిగ్ బాస్ సీజన్ 2 లో ఈ వారం ఎలిమినేషన్ పై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అందరూ ఆటలో చక్కటి పెర్ఫార్మన్స్ కనబరుస్తున్నవారే కావడంతో హౌస్ నుండి వదిలి వెళ్లేది ఎవరనే విషయంలో ఆసక్తి పెరిగిపోతుంది. ఇప్పటికి ఇంకా ఎవరు వెళ్లిపోతున్నారనే విషయంలో ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్త పడ్డారు నిర్వాహకులు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బాబు గోగినేని, తనీష్, దీప్తి నల్లమోతు, గణేష్, శ్యామల ఉన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ వారం కెప్టెన్ టాస్క్ లో తనీష్ గెలవడంతో అతడు ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు. మిగిలిన ఐదుగురిలో గీతామాధురి భారీ ఓట్లు సంపాదించిందని సమాచారం. దీప్తి, శ్యామలలకు కూడా మంచి ఓట్లే దక్కాయని అంటున్నారు. ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది బాబు గోగినేని, గణేష్ అని చెబుతున్నారు. ప్రతివారం నామినేట్ అవుతూ నామినేషన్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు గణేష్. అయితే ఆడియన్స్ అతడి సేవ్ చేస్తుండడం, అదృష్టం కలిసి రావడంతో అతడు ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు.

కానీ హౌస్ లో అతడు కౌశల్ తో ప్రవర్తించిన తీరు కారణంగా కౌశల్ ఆర్మీ అతడిని టార్గెట్ చేసింది. అలానే బాబు గోగినేనిని కూడా బయటకి పంపాలని కౌశల్ ఆర్మీ నిర్ణయించుకుంది. ఈ ఇద్దరిలో ఒకరు కచ్చితంగా బయటకి వెళ్లిపోయే అవకాశాలున్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అదృష్టం అడ్డం తిరిగితే గనుక గణేష్ బయటకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.