ఎవరు హౌస్ లో ఉండాలో.. ఎవరు నామినేషన్స్ లో ఉండాలో తనిష్, అమిత్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ప్రముఖ తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 2 రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోతోంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బాబు గోగినేని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కాగా.. సోమవారం మళ్లీ నామినేషన్స్ మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రోమోని స్టార్ మా పేజీలో పోస్టు చేశారు.
ఆ ప్రమో ప్రకారం.. ఈ వారం ఎలిమినేషన్స్ తనిష్, అమిత్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. తనిష్ కెప్టెన్ కావడం వల్ల ఈ వారం ఎలిమినేషన్స్ లో లేరు. అలాగే.. కమల్ హాసన్ ఇచ్చిన స్పెషల్ పవర్ వల్ల అమిత్ కూడా నామినేషన్స్ లో లేరు. దీంతో.. ఈ వారం నామినేషన్ల బాధ్యత బిగ్ బాస్ వీరిద్దరి చేతిలో పెట్టారు.
ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే... హౌస్ లో ఒక ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేశారు. అందులో ఒక్కో స్తంబం దగ్గర ఇద్దరిద్దరుగా హౌస్ మేట్స్ నిలబడి ఉన్నారు. ఆ ఇద్దరు హౌస్ మేట్స్.. వాళ్లు ఇంట్లో ఎందుకు ఉండాలని అనుకుంటున్నారో కారణం చెప్పాల్సి ఉంటుంది. వారి కారణాలు విని.. ఎవరు హౌస్ లో ఉండాలో.. ఎవరు నామినేషన్స్ లో ఉండాలో తనిష్, అమిత్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Sep 9, 2018, 1:00 PM IST