బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నందిని రాయ్ గత వారం ఎలిమినేషన్ లో బయటకి వచ్చేసింది. అలా బయటకి వచ్చేసిన ఆమె తను ఎలిమినేట్ అవ్వడానికి కారణం కౌశల్ ఆర్మీనే అని చెబుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. 'నేను ఇంటికి వెళ్లగానే మా అమ్మ, నాన్న హౌస్ లో కొన్ని ఎపిసోడ్స్ ని చూపించారు. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం కౌశల్ ఆర్మీ అని చెప్పారు.

సోషల్ మీడియా నన్ను ట్రోల్ చేయడం అంతా చూసి నేను కూడా అదే ఫీల్ అయ్యాను. బయట ఇంత జరుగుతుందా అనుకున్నాను. నిజానికి హౌస్ లో జరుగుతున్నది ఒకరి.. బయటకి చూపిస్తున్నది ఒకటి. కౌశల్ నాకు మంచి సపోర్ట్ ఇస్తాను. నన్ను నామినేషన్స్ నుండి ఒకసారి సేవ్ చేశాడు. ఇద్దరం తిట్టుకుంటాం, మళ్లీ కలిసిపోతాం. సర్వైవర్స్ టాస్క్ లో అయితే నేను తన మీద అలిగానని వచ్చి మాట్లాడి నాకు ఫుడ్ కూడా తినిపించాడు. అవేవీ టీవీలో చూపించట్లేదు. మేమిద్దరం కొట్టుకున్నదే చూపించారు. దీంతో అందరికీ మా ఇద్దరికీ పడదని తప్పుగా అర్ధమైంది.

ఇక తనీష్ ని నేను అర్ధరాత్రి హగ్ చేసుకోవడం పెద్ద రాద్ధాంతం చేశారు. నిజానికి అది అందరూ తప్పుగా తీసుకున్నారు. దానికంటే మూడు గంటల ముందు నుండి మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. తనీష్ కొన్ని విషయాలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో నీకొక హగ్ అవసరమని నేనే అన్నాను. లైట్స్ ఆఫ్ చేయడంతో లేచి అతడిని హగ్ చేసుకున్నాను. బహుశా టైమింగ్ రాంగ్ అయి ఉండొచ్చు కానీ నా ఇంటెన్షన్ కాదు. తనీష్, దీప్తి సునైనాలను కూడా వేరేగా చూపిస్తున్నారు. కానీ హౌస్ లో ఉండి చూసింది మేము. బ్రదర్, సిస్టర్ రిలేషన్ ని కూడా మరో విధంగా చూపిస్తున్నారు'' అని స్పష్టం చేశారు.