బిగ్ బాస్2: తనీష్ లవ్ లెటర్ ఇస్తే.. విసిరి కొట్టింది

bigg boss2: nandini rejects tanish's love letter
Highlights

సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నందినిని ఎంపిక చేయగా షూటింగ్ జరుగుతున్నప్పుడు తనీష్ ఆమెకు సైట్ కొట్టడం మొదలుపెట్టాడు. తన ప్రేమను ఓ లెటర్ రూపంలో ఆమెకు రాసి ప్రొడక్షన్ బాయ్ గా పనిచేసే గణేష్ కు ఇచ్చి పంపిస్తాడు. ఆ లెటర్ ను నందిని రిజెక్ట్ చేయడంతో తనకు ఎలా పడదో చూస్తాను అన్నట్లు తనీష్.. గణేష్ కు చెప్పడం సరదాగా సాగింది. 

బిగ్ బాస్ సీజన్ 2 మొదలయ్యి ఐదు వారాలు పూర్తయ్యాయి. సోమవారం ఎపిసోడ్ లో కామన్ మ్యాన్ గణేష్ నెత్తిపై అమిత్ గుడ్డుతో కొట్టడంతో అతడు ఏడవడం, హౌస్ లో వాళ్లు అమిత్ ను తప్పుబట్టడం వంటి విషయాలతో కొంత ఆసక్తికరంగా కొంత నిరుత్సాహంగా షో సాగింది. మంగళవారం నాటికి మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ తో హౌస్ లో నవ్వులు పూసాయి. టాస్క్ ఏంటంటే.. హౌస్ లో ఉన్న సభ్యులు బిగ్ బాస్ ఇచ్చిన ఎక్విప్మెంట్ తో ఓ సినిమా తీసి చూపించాలి.

అమిత్ ను డైరెక్టర్ గా, దీప్తిని అసిస్టెంట్ డైరెక్టర్ గా, రోల్ రైడాను కెమెరామెన్ గా, తేజస్విని మేకప్ కమ్  కొరియోగ్రాఫర్ గా బిగ్ బాస్ సెలక్ట్ చేశారు. లవ్, రొమాన్స్, ఐటెం సాంగ్ ఇలా అన్ని అంశాలు ఉండేలా సినిమా చేయాలి. ఈ ముగ్గురు కూడా హౌస్ లో తమ సినిమాకు సరిపోయే నటీనటులను ఎంపిక చేసుకొని మిగిలిన వారిని పనుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఆడిషన్స్ లో తనీష్, కౌశల్, సామ్రాట్, దీప్తి సునైనా, నందినిలను ఎంపిక చేయగా.. గీతామాధురి, గణేష్, బాబు గోగినేని వాళ్లకు సహాయకులుగా పని చేస్తున్నారు.

సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నందినిని ఎంపిక చేయగా షూటింగ్ జరుగుతున్నప్పుడు తనీష్ ఆమెకు సైట్ కొట్టడం మొదలుపెట్టాడు. తన ప్రేమను ఓ లెటర్ రూపంలో ఆమెకు రాసి ప్రొడక్షన్ బాయ్ గా పనిచేసే గణేష్ కు ఇచ్చి పంపిస్తాడు. ఆ లెటర్ ను నందిని రిజెక్ట్ చేయడంతో తనకు ఎలా పడదో చూస్తాను అన్నట్లు తనీష్.. గణేష్ కు చెప్పడం సరదాగా సాగింది. ఇక హీరోలుగా నటిస్తున్న వారిని నమ్మొద్దని తనకు ఈ ఫీల్డ్ లో చాలా అనుభవం ఉందని బాబు గోగినేని హీరోయిన్ గా నటించే నందినికి ప్రత్యేకంగా చెప్పడం అందరినీ నవ్వించింది. 

loader