Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 2: కౌశల్ తప్పులు చూపి విలన్ గా మార్చే ప్రయత్నం!

బిగ్ బాస్ సీజన్ 2 ఏదైనా జరగొచ్చు అనే క్యాప్షన్ కి తగ్గట్లుగానే ఇప్పుడు హౌస్ లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు నెలలుగా సాగుతోన్న ఈ షో చివరి దశకు చేరుకుంటోంది. 

bigg boss2: kaushal's negative side
Author
Hyderabad, First Published Sep 18, 2018, 3:08 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 ఏదైనా జరగొచ్చు అనే క్యాప్షన్ కి తగ్గట్లుగానే ఇప్పుడు హౌస్ లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు నెలలుగా సాగుతోన్న ఈ షో చివరి దశకు చేరుకుంటోంది. అయితే గత కొద్దిరోజులుగా హౌస్ లో కౌశల్ ని నెగెటివ్ గా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరి ఆరోపణలు. ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కౌశలే బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఆయన కోసం తయారైన కౌశల్ ఆర్మీ విధృతంగా ప్రచారం చేస్తూ అతడిని విజేత చేయాలని చూస్తోంది. కానీ బిగ్ బాస్ ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి.

దీంతో కౌశల్ ని నెగెటివ్ సైడ్ చూపించడానికి ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ కౌశల్ వల్ల తాము ఎదుర్కొన్న సమస్యలను ఒక్కొక్కటిగా బయటపెడుతూ కౌశల్ వల్లే టికెట్ టు ఫినాలే టాస్క్ కి ఎవరూ ఎంపిక కాలేదని అన్నారు. కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్ లో రంగు నీళ్ల గ్లాస్ చివరి వరకు ఎవరి దగ్గరుందని బిగ్ బాస్ రెండు సార్లు అడిగినా కౌశల్.. రోల్ పేరు చెప్పకపోవడంతో కెప్టెన్సీ ఎవరికీ కాకుండా పోయింది.

దానికి కూడా కారణం కౌశల్ అంటూ హౌస్ మేట్స్ అందరూ అతడిపై  మండిపడ్డారు. ఇలా చాలా విషయాల్లో కౌశల్ తో గొడవకి దిగారు. శనివారం ఎపిసోడ్ లో నాని హౌస్ మేట్స్ అందరినీ ఉద్దేశిస్తూ మీకు హౌస్ లో ఎవరైనా చేసిన వ్యాఖ్యలు నచ్చకపోతే అడిగే ధైర్యం లేదా అంటూ ప్రశ్నించడంతో హౌస్ మేట్స్ అంతా నిన్నటి ఎపిసోడ్ లో ఓపెన్ అయినట్లు అనిపించింది.

ముఖ్యంగా రోల్.. అసలు వివాదాలకి దూరంగా ఉండే రోల్ సైతం కౌశల్ పై విరుచుకుపడ్డాడు. కౌశల్ కూడా ఓ టాస్క్ బిగ్ బాస్ తప్పుగా రాశారని, ఏకంగా బిగ్ బాస్ నే తప్పుబట్టడంతో హౌస్ మేట్స్ కి మరో పాయింట్ దొరికినట్లయింది. చివరకి కౌశల్ దృష్టిలో బిగ్ బాస్ కూడా తప్పు చేశాడట అంటూ అతడిపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ఇలా కౌశల్ చేసిన తప్పులు ఎత్తి చూపిస్తూ ప్రజల్లో అతడి పాపులారిటీని కావాలనే తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కౌశల్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

కౌశల్ తరువాతే గీతామాధురి.. అమిత్ కామెంట్స్!

బిగ్ బాస్2: కౌశల్ ని అప్పుడెందుకు ప్రశ్నించలేదు..? హౌస్ మేట్స్ పై నెటిజన్లు ఫైర్!

బిగ్ బాస్2: పిచ్చా.. కౌశల్ పై తనీష్ కామెంట్స్!

బిగ్ బాస్2: కౌశల్ తో సహా అందరూ నామినేషన్ లో.. హౌస్ మేట్స్ కి కౌశల్ కి మధ్య రచ్చ..

 

Follow Us:
Download App:
  • android
  • ios