బిగ్ బాస్2: కౌశల్, తనీష్ ఒకరినొకరు తన్నుకునేంతగా..

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 19, Sep 2018, 12:21 AM IST
bigg boss2: fight between kaushal and tanish
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫీనాలే కి చేరుకోవడంతో కంటెస్టెంట్స్ మధ్య పోరు ఓ రేంజ్ లో నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ కౌశల్ పై మాటల యుద్ధం జరిపారు. ఇక తాజాగా హౌస్ లో గ్రాండ్ ఫినాలేకి వెళ్లే అవకాశాన్ని రోల్ రైడా దక్కించుకొని అందరికీ షాక్ ఇచ్చాడు

బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫీనాలే కి చేరుకోవడంతో కంటెస్టెంట్స్ మధ్య పోరు ఓ రేంజ్ లో నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ కౌశల్ పై మాటల యుద్ధం జరిపారు. ఇక తాజాగా హౌస్ లో గ్రాండ్ ఫినాలేకి వెళ్లే అవకాశాన్ని రోల్ రైడా దక్కించుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి 'మీ ఇసుక జాగ్రత్త' అనే టాస్క్ ను ఇచ్చారు.

ఈ టాస్క్ లో గెలిచిన వారికి ఎలిమినేషన్ తో మినహాయింపు ఇవ్వడంతో పాటు నేరుగా ఫినాలేకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ టాస్క్ రెండు లెవెల్స్ లో జరుగుతుంది. మొదటి లెవెల్ లో కౌశల్, గీతా, రోల్ ఇసుకను కాపాడుకుంటూ ఉండగా మిగిలిన వాళ్లు ఆ ఇసుకను తొలగించే ప్రయత్నం చేయాలి. కింద పడిన ఇసుకను తీసి మళ్లీ బిగ్ ఇచ్చిన కంటైనర్స్ లో వేసుకోవచ్చు.

దీంతో కౌశల్, రోల్, గీతా ఇసుకను కాపాడుకుంటుంటే.. దీప్తి, తనీష్, సామ్రాట్ లు ఆ ఇసుకను కింద పడేస్తూ, స్విమ్మింగ్ పూల్ లో వేస్తూ ఇసుకను నాశనం చేసే  ప్రయత్నం చేశారు. మొదట రోల్ రైడా ఇసుకను కిందపడేసిన తనీష్.. తరువాత మాత్రం సామ్రాట్ తో కలిసి రోల్ ని గెలిపించే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి రోల్ ని సేవ్ చేస్తూ కౌశల్ ని టార్గెట్ చేశారు.

ఇది ఫిజికల్ టాస్క్ కావడంతో ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లారు. తనీష్, కౌశల్ ఒకరికొకరు సవాల్ విసురుకుంటూ కొట్టుకోవడానికి రెడీ అయ్యారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఒకరికొకరు హాని కలిగించుకోకూడదని హెచ్చరించారు. అయినప్పటికీ హౌస్ మేట్స్ మారకపోవడంతో టాస్క్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు బిగ్ బాస్.

చివరగా ఎవరి కంటైనర్ లో ఎక్కువ ఇసుక ఉందో సామ్రాట్ ని చూసి చెప్పమని బిగ్ బాస్ చెప్పగా.. దానికి సమాధానంగా రోల్ రైడా పేరు చెప్పారు. దీంతో రోల్ ని టాస్క్ విన్నర్ గా ప్రకటించారు నాని. 

loader