బిగ్ బాస్2: తల్లి చీవాట్లు పెట్టినా.. తనీష్ మారలేదు

bigg boss2: chance to talk episode highlights
Highlights

ఈ క్రమంలో తనీష్ తన తల్లితో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె దీప్తి సునైనాతో క్లోజ్ గా ఉండకు.. ముద్దు చేయకు అని చెప్పడంతో పాటు.. నాని సలహాలను పాటించు అని చెప్పారు. ఆమె చెప్పిన విషయాలను సామ్రాట్ తో షేర్ చేసుకున్న తనీష్ ఆ మాటలను దీప్తి సునైనాకు చెప్పొద్దని అన్నాడు

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లకు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ క్రమంలో తనీష్ తన తల్లితో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె దీప్తి సునైనాతో క్లోజ్ గా ఉండకు.. ముద్దు చేయకు అని చెప్పడంతో పాటు.. నాని సలహాలను పాటించు అని చెప్పారు. ఆమె చెప్పిన విషయాలను సామ్రాట్ తో షేర్ చేసుకున్న తనీష్ ఆ మాటలను దీప్తి సునైనాకు చెప్పొద్దని అన్నాడు.

అయితే తన తల్లి మాటలను పట్టించుకోని తనీష్ నేటి ఎపిసోడ్ లో కూడా సునైనాను అంటిపెట్టుకొనే ఉన్నారు. గీతామాధురి, బాబు గోగినేని, దీప్తి నల్లమోతులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడగా.. సునైనా, గణేష్, నందినిలు మాత్రం ఆ ఛాన్స్ మిస్ అయ్యారు. దీంతో వారికి మరో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అయితే దీనికోసం వారి కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. మరి ఆ ఎలాంటి త్యాగాలు చేయాల్సి వస్తుందో.. రేపటి ఎపిసోడ్ లో చూడాలి!

loader