బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే మరికొద్ది సేపట్లో గ్రాండ్ గా మొదలు కానుంది. హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ నుండి విన్నర్ ఎవరో తేలిపోనుంది. అరియనా, అఖిల్, సోహైల్, అభిజీత్ మరియు హారిక ఫైనల్ కి చేరిన సంగతి తెలిసిందే. కాగా బిగ్ బాస్ హౌస్ లో లీకులు సర్వసాధారణం. నిన్న బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూట్ నిర్వహించారట. దీనితో బిగ్ బాస్ విన్నర్ మరియు రన్నర్ ఎవరో అన్న ఇన్ఫర్మేషన్ లీకైంది అంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం విన్నర్ మరియు రన్నర్ ఎవరో తెలిసిపోయింది. 
 
బిగ్ బాస్ ఫైనల్ కి రెండు వారాల ముందు నుండే ఈ సారి టైటిల్ విన్నర్ ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైంది. బిగ్ బాస్ షోపై ప్రేక్షకులలో ఉన్న ఆసక్తి రీత్యా అనేక మీడియా సంస్థలు, విన్నర్ ఎవరనే విషయంపై పోల్స్ నిర్వహించడం జరిగింది. ఈ పోల్స్ లో టైటిల్ కోసం అభిజీత్ మరియు అరియనా మధ్య తీవ్ర పోటీ నడుస్తుందని వార్తలు వచ్చాయి. ఓ దశలో అరియనా అభిజీత్ ని సైతం క్రాస్ చేశారని అందరూ అనుకున్నారు. 
 
ఫైనల్ గా టైటిల్ మాత్రం అభిజీత్ దే అని సమాచారం అందుతుంది. టైటిల్ పోరులో ఓట్ల ఆధారంగా అరియనా నాలుగవ స్థానానికి పరిమితం అయ్యిందట. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన హారిక చివరిదైన ఐదవ స్థానం పొందారట. ఇక టైటిల్ రేసు నుండి అరియనా, హారిక తప్పుగా మేల్ కంటెస్టెంట్స్ అభిజీత్, సోహైల్ మరియు అఖిల్ టైటిల్ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో కూడా టాప్ టూ ఎవరనే విషయం మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందరూ ఊహిస్తున్నట్లే అభిజీత్ విన్నర్ గా గెలుపొందారట. 
 
అభిజిత్ తరువాత స్థానంలో అత్యధిక ఓట్లతో సోహైల్ ఉన్నాడట.ఈ సీజన్ కి గానూ, అభిజీత్ విన్నర్ మరియు సోహైల్ రన్నర్ అంటున్నారు. అఖిల్ వీరిద్దరి తరువాత మూడో స్థానంలో నిలిచాడట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతూ ఉంది. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.