Bigg Boss Telugu 9 Day 12 Promo 3: బిగ్ బాస్ రియాల్టీ షో రసవత్తరంగా కొనసాగుతుంది. టెనెంట్స్ కు ఓనర్స్ గా మారే టాస్క్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ టాస్క్ తో లవ్ బర్డ్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్.. తాజాగా టాస్క్ తో బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య నిప్పు రాజేశాడు బిగ్ బాస్. ఓనర్స్ ఇచ్చే వస్తువులను జాగ్రత్త భద్రపర్చుకునే క్రమంలో రీతూ చౌదరీ వర్సెస్ తనుజా గా మారింది. వీరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
- Home
- Entertainment
- Bigg Boss Telugu 9 Live: బిగ్ బాస్ 9 ఓటింగ్ షాక్! టాప్‌లో సుమన్ శెట్టి, డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 9 Live: బిగ్ బాస్ 9 ఓటింగ్ షాక్! టాప్‌లో సుమన్ శెట్టి, డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?

Bigg Boss Telugu 9 Voting Update : రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం ఎలిమినేషన్ రేస్ ఆసక్తికరంగా మారింది. ఈ వారం మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఆన్లైన్ ఓటింగ్‌లో ఇప్పటికే హాట్ ట్రెండ్ మొదలైంది. సుమన్ శెట్టి మరోసారి దూసుకెళ్లి 41% ఓట్లతో టాప్‌లో ఉన్నాడు. భరణి శంకర్ 26% ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
మాస్క్ మ్యాన్ హరిత్ హరీష్ (8%), డీమాన్ పవన్ (7.5%) సేఫ్ జోన్‌లో ఉన్నప్పటికీ మధ్యస్థానంలో కొనసాగుతున్నారు. ఫ్లోరా సైనీ (6%) కూడా తక్కువ ఓట్లు తెచ్చుకుంది. ప్రియా శెట్టి (5%), మనీశ్ మర్యాద (3%) ఓట్లతో ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉన్నారు. గత వారం ఎలిమినేషన్ నుండి కాస్త గట్టెక్కిన ఫ్లోరా సైనీకి కూడా ఈ వారం పరిస్థితి అంత బలంగా లేదు. అదే ఓటింగ్ ట్రెండ్ కొనసాగితే మనీశ్ మర్యాద ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Bigg Boss Telugu 9 Live: Bigg Boss Telugu 9: రీతూ వర్సెస్ తనూజ.. ఎవరు అసలైన గేమ్ ఛేంజర్?
Bigg Boss Telugu 9 Live: Bigg Boss Telugu 9: కెప్టెన్సీ టాస్క్ తో హైటెన్షన్.. లవ్ బర్డ్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్
Bigg Boss Telugu 9 Day 11 Promo 2: బిగ్ బాస్ 9లో కెప్టెన్సీ టాస్క్ సమయంలో రీతూ చౌదరి–కళ్యాణ్ జంట మధ్య గొడవ స్టార్ అయ్యింది . 11వ రోజు విడుదలైన ప్రోమోలో ఇద్దరి మధ్య వాదన, చిట్కాలు, కౌంటర్‌లతో టాస్క్ ఉత్కంఠభరితంగా మారింది. కెప్టెన్ అథారిటీ, హ్యాండ్లింగ్ విషయంలో ఇద్దరి మధ్య టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది.
Bigg Boss Telugu 9 Live: Bigg Boss: కింగ్ నాగ్ షోపై బిగ్ బాస్ విన్నర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు 2 విన్నర్ కౌశల్ మరోసారి వార్తల్లో నిలిచారు. పని పాటా లేనోళ్లే బిగ్ బాస్ చూస్తారంటూ బిగ్ బాస్ 9పై షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Bigg Boss Telugu 9 Live: Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లో రెండో కెప్టెన్సీ టాస్క్.. ఎవరి స్ట్రాటజీ వర్క్ అవుతుంది?
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో రెండో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. మొదటి వారం సంజన తొలి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు రెండవ వారానికి సంబంధించిన రెండో కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ కొత్త టాస్క్‌ని ప్రారంభించారు. తాజా ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి ఛాలెంజ్ ఇస్తూ “మీ టైమర్‌లో మిగిలిన పూర్తి కౌంట్‌డౌన్‌ను జీరో చేయండి” అని చెప్పారు. ఈ టాస్క్‌లో ఒకవైపు టెనెంట్స్, మరోవైపు ఓనర్స్ ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ బజర్ కొట్టకపోవడం ద్వారా నమ్మకం పరీక్షించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ టాస్క్ హౌస్‌లో మంచి హీట్ తెచ్చింది. రెండవ కెప్టెన్ ఎవరు అవుతారనేది మాత్రం పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు సస్పెన్స్.
Bigg Boss Telugu 9 Live: Bigg Boss Telugu 9 Voting: రెండో వారంలో ఎలిమినేషన్ సస్పెన్స్.. ఎవరు బయటకు వెళ్తారంటే?
Bigg Boss Telugu 9 Voting Update: బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం ఓటింగ్ ట్రెండ్స్ లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ లో సుమన్ శెట్టి దూసుకెళ్తుండగా.. డేంజర్ జోన్ లో ఎవరు ఉన్నారు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఉత్కంఠగా మారింది. ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం సుమన్ శెట్టి 41% ఓట్లతో టాప్‌లో ఉండగా, భరణి 26%తో రెండో స్థానం, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో నిలిచారు.