బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ కు కప్ అందించడం కోసం చీఫ్ గెస్ట్ గా వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సందర్భంగా నాగార్జున ఏవి ని రామ్ చరణ్ అడిగి ప్లే చేయించారు. ఈక్రమంల నాగార్జున ఈ సీజన్ అంతా చాలా స్టైలీష్ గా కనిపించారని.. ఆయన లుక్స్ చాలా బాగున్నాయని అన్నారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్ అంటూ.. సరదాగా అన్నారు.
- Home
- Entertainment
- Bigg Boss Telugu 8 live Updates|Day 105: గ్రాండ్ ఫినాలేకి అంతా సిద్ధం, విన్నర్ పై ఉత్కంఠ
Bigg Boss Telugu 8 live Updates|Day 105: గ్రాండ్ ఫినాలేకి అంతా సిద్ధం, విన్నర్ పై ఉత్కంఠ

105 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకి రెడీ అయింది. ఆదివారం జరగబోయే ఫైనల్ ఎపిసోడ్ లో విజేత ఎవరో తేలిపోతుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగినట్లు తెలుస్తోంది.
నాగార్జున పై రామ్ చరణ్ సెటైర్లు..
రామ్ చరణ్ ను తిట్టిన గంగవ్వ..
రామ్ చరణ్ ను గంగవ్వ తిట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా..? గంగవ్వ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటించారు. బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన రామ్ చరణ్ ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఓ అధికారిగా ఉన్న నన్ను మా సమస్యలు తీర్చండి అని అడుగుతూ గంగవ్వ తిట్టారంటూ చరణ్ అన్నారు.
55 లక్షలు ఉన్నా నాకు వద్దు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో గోల్డెన్ బ్రీఫ్ కేస్ ను రిజెక్ట్ చేశాడు నిఖిల్. డబ్బు ఇప్పుడు కాకపోయినా తరువాత సంపాదించుకుంటాను అన్నారు. మనసులు గెలుచుకున్నాను. ఓడిపోయినా ఈ ఆనందాన్ని ఆ డబ్బుతో పోగోట్టుకోలేను అని అన్నాడునిఖిల్.
ప్రైజ్ మనీ రిజెక్ట్ చేసిన నిఖిల్ , గౌతమ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఫైనల్ గా ఇద్దరు నిలిచారు గౌతమ్, నిఖిల్. ఇక ఈ ఇద్దరికిలో ఒకరికి గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఇచ్చే ప్రయత్నం చేశారు నాగార్జున. అయితే అందులో ఎంత డబ్బు ఉంది అనేది తెలుసుకోవాలి అనుకోలేదు ఇద్దరు మాకు వద్దు అని చెప్పేశారు.
నబిల్ ఔట్.. టాప్ 2 నిఖిల్, గౌతమ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో టాప్ 3గా బయటకు బచ్చాడు నబిల్ అఫ్రీది. టాప్ 3 కంటెస్టెంట్ ను స్టేజ్ మీదకు తీసుకురావడం కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక టాప్ 2 గా బిగ్ బాస్ హౌస్ లో నిలిచారు నిఖిల్, గౌతమ్.
ప్రేరణ ఎలిమినేటెడ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో టాప్ 5 లో ఉన్న ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రేరణ ఎలిమినేట్ అయ్యింది. టాప్ 5 లో ప్రేరణ టాప్ 4 ప్లేస్ సాధించింది. అంత మంది మహిళా కంటెస్టెంట్స్ లో 15 వారాలు బిగ్ బాస్ లోనిలబడింది ప్రేరణ.
బిగ్ బాస్ తెలుగు ఫినాలే స్టేజ్ పై కన్నడ హీరో ఉపేంద్ర
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై సందడి చేశారు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర. పాన్ ఇండియా రేంజ్ లో ఉపేంద్ర యూ ఐ అనే సినిమా చేశారు. 5 భాషల్లో ఆ సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో తెలుగు బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ పై ఆ సినిమా ప్రమోషన్స్ కూడా నిర్వహించారు.
అవినాష్ ఎలిమినేటెడ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో టాప్ 5 గా నిలిచాడు అవినాష్. టాప్ 5 లో ఫస్ట్ ఎలిమినేట్అయ్యి స్టేజ్ మీదకు వచ్చాడు. అంతే కాదు అవినాష్ బెస్ట్ ఎంటర్టైనర్ గా పొగుడుతూ.. నాగార్జున అభినందించాడు. అవినాశ్ ను హౌస్ లోకి వెళ్ళి మరీ స్టేజ్ మీదకు తీసుకువచ్చారు కన్నడ నటుడు ఉపేంద్ర.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ గా నిఖిల్..
అంతా అనుకున్నట్టే జరిగింది. మొదటి నుంచి టైటిల్ రేస్ లో ముందున్న నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ గా నిలిచాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి.. రెండు వారాల తరువాత నిఖిల్ కు గట్టి పోటీ ఇచ్చాడు గౌతమ్. అయితే గౌతమ్ రన్నర్ గా నిలిచాడు. గౌతమ్ విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. కాని రన్నర్ గా సర్ధుకోవలసి వచ్చింది.
రామ్ చరణ్ చేతుల మీదుగా గ్రాండ్ ఫినాలే టైటిల్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ నిలిచాడు. రన్నర్ గా గౌతమ్ నిలిచాడు. అందరుఅనుకున్నట్టుగానే జరిగింది. ఆ ఇద్దరిలోనే విన్నర్.. రన్నర్ ఉంటాడని ప్రచారం జరిగింది. ఇక విన్నర్ కు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కప్ ను మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అందించాడు.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు డుమ్మా కొట్టిన ఆ ఇద్దరు...?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాడ్ ఫినాలే చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఈ ఈవెంట్ కు హౌస్ లోకి వచ్చి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా వచ్చారు. కాని ఇద్దరు మాత్రం డుమ్మా కొట్టారు. స్టార్ యాంకర్ విష్ణు ప్రియ తో పాటు హరితేజ్ కూడా ఈ వెంట్ కు రాలేదు.
బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అతనే.. కంటెస్టెంట్స్ అంతా ఒకటే మాట..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫినాలే గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. నాగార్జున ఎంట్రీతో పాటు.. ఈ సీజన్ లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా సందడి చేశారు. అయితే వారంతా విన్నర్ పై అందరు గౌతమ్, నిఖిల్ పేర్లు మాత్రమే చెపుతున్నారు. వీన్నర్ ఈ ఇద్దరిలో ఒకరు అంటున్నారు.
గ్రాండ్ ఫినాలేకి అంతా సిద్ధం, విన్నర్ పై ఉత్కంఠ
105 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకి రెడీ అయింది. ఆదివారం జరగబోయే ఫైనల్ ఎపిసోడ్ లో విజేత ఎవరో తేలిపోతుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఇక టెలికాస్ట్ చేయడమే మిగిలి ఉంది. గ్రాండ్ ఫినాలే కోసం ఈ సీజన్ లో పాల్గొన్న సభ్యులంతా హాజరయ్యారు. ప్రస్తుతం ఫైనలిస్టులుగా హౌస్ లో ప్రేరణ, నబీల్,నిఖిల్, గౌతమ్, అవినాష్ ఉన్నారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.