12:39 PM (IST) Sep 25

కాంతార టీమ్ కొత్త చీఫ్ గా కిర్రాక్ సీత..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ వీక్ కు ఇంట్రెస్టింగ్ కంటెంట్ పెరిగిపోతోంది. ఇక కంటెస్టెంట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యే టాస్క్ లతో బిగ్ బాస్ ఏమాత్రం ఖాళీగా ఉంచడం లేదు. ఇక తాజా ఎపిసోడ్ లో కాంతార టీమ్ కు కొత్త చీఫ్ గా కిర్రాక్ సీత ఎంపికయ్యింది. అభయ్ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడంతో.. ఆ క్లాన్ కు కొత్త ఛీఫ్ కోసం పోటీ పెట్టగా.. అందులో ఎంతో కఫ్టం మీద సీత విన్ అయ్యింది. 

12:38 PM (IST) Sep 25

నిఖిల్ - పృధ్వీలకు కొత్త పేరు పెట్టిన విష్ణు ప్రియా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో.. వరస్ట్ గేమ్ ఆడుతున్న వాళ్ళలో సోనియా ముందు ఉంది. అటు పృధ్వీని.. ఇటు నిఖిల్ ను తన చెప్పుచేతల్లో పెట్టుకుని.. ఆడిస్తుంది సోనియా. ఈ విషయం అటు హౌస్ లో ఉన్నవారికి.. ఇటు ఆడియన్స్ కు బాగా అర్ధం అవుతుంది. దాంతో నిఖిల్‌, పృధ్వి ఇద్దరికి దద్దోజనం అని పేరు పెట్టింది విష్ణు ప్రియ. ఆమె చుట్టు తిరుగుతూ.. వారి గేమ్ వారు ఆడుకోలేకపోతున్నారంటూ మండిపడింది. 

12:37 PM (IST) Sep 25

డేంజర్ జోన్ లో సోనియా.. బిగ్ బాస్ కాపాడతాడా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో నాలుగోవారం సోనియా డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆట తీరు.. ఇతరులపై నోరు జారడం.. పృధ్వీ, నిఖిల్ లను చేతులో పెట్టుకుని.. వారి గేమ్ ను నాశనం చేయడం లాంటి కారణాలు ఆడియన్స్ కు చిరాకు తెప్పిస్తున్నాయి. దాంతో సోనియాకు వ్యతిరేకంగా ఓట్లు పోల్ అవుతున్నట్టు తెలుస్తోంది. కాని బిగ్ బాస్ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో ఈ వారం సోనియా పక్కగా హౌస్ ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.