Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రోమో వచ్చేసింది... కింగ్ నాగార్జున లుక్ అదిరిందిగా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హోస్ట్ విషయంలో.. ఉత్కంటకు తెరపడింది. హోస్ట్ గా కింగ్ నాగార్జునను ప్రకటిస్తూ.. సూపర్ ప్రోమోను రిలీజ్ చేసింది స్టార్ మా.. 

Bigg Boss Telugu Season 7 Promo King Nagarjuna Look Viral JMS
Author
First Published Jul 19, 2023, 8:15 AM IST

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ పై ఉత్కంట తీరిపోయింది. హోస్ట్ గామరోసారి కింగ్ నాగార్జునను ప్రకటిస్తూ.. స్టార్ మా తాజా ప్రోమోను రిలీజ్ చేసింది. అయితే సీజన్ 7 సూన్ అన్నారు కాని.. బిగ్ బాస్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు టీమ్.  ఈసారి మరిన్ని సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో పాటు.. ఎమోషన్స్ అంతకు మించిన అంశాలు ఉంటాయని ముందుగానే వెల్లడించిన బిగ్ బాస్ టీమ్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోని పంచుకున్నారు. స్టార్ మా మరియు డిస్నీ+ హాట్‌ స్టార్‌ ఓటీటీలోనూ బిగ్ బాస్  స్ట్రీమింగ్‌ కానుందని వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా హోస్ట్ ని అనౌన్స్ చేసిన మేకర్స్.. సరికొత్త ప్రోమోని రిలీజ్ చేసారు. 

బిగ్ బాస్ తెలుగు  7వ సీజన్ కు  కూడా టాలీవుడ్ కింగ్.. మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్టుగా ఉండబోతున్నారు. గత నాలుగుసీజన్లకు ఆయనే యాంకర్ గా  వ్యవహరించారు. ప్రస్తుతం 5వసారి హోస్టింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. బిగ్ బాస్ గురించి మీకు తెలిసిందని మీరు అనుకున్నదంతా విప్లవాత్మకంగా మారబోతోంది మీకు అత్యంత ఇష్టమైన నాగార్జునతో ఈ సీజన్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? గందరగోళంగా ఉందా? ఉత్సాహంగా ఉందా..? బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి మరింత తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి అని  స్టార్ మా తన  ఇన్ స్టాగ్రామ్ పోస్టులో  పోస్ట్ చేశారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

ప్రోమోలో.. ఈసారి సీజన్ 7 సరికొత్తగా ఉండబోతోంది అని చెప్పబోయిన నాగార్జున.. రొటీన్ గా చెప్పేదేగా అంటూ ఆగిపోతారు.. ఆతరువాత చుట్టు ఉన్న వస్తువలు పైకి లేవడం.. తో ఈసారి సీజన్ అంతకు మించి ఉండేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసారి కింగ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. కంప్లీట్ గా లుక్ మార్చేశాడు నాగ్. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ.. డిఫరెంట్ స్టైల్లో కనిపించడానికి ప్రయత్నంచేశాడు. గత సీజన్ల అనుభాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పాత ఛాయలు లేకుండా..సరికొత్తగా ప్లాన్ చేశారట బిగ్ బాస్ ను. అంతే కాదు లాస్ట్ రెండు సీజన్లు.. ముఖ్యంగా సీజన్ 6 అట్టర ప్లాప్ అవ్వడంతో.. సీజన్ 7ను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని చూస్తున్నారు. 

బిల్లితెన ప్రేక్షకులకు బిగ్ బాస్ వస్తుందంటే చాలు ఇక పండగే.. టాలీవుడ్ తెరపై కూడా ఈ షో బాగా పాపులర్ అయ్యింది. లాస్ట్ ఇయర్ మాత్రం కాస్త ప్లాప్ టాక్ వచ్చినా.. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 కు మసాలా గట్టిగా అద్దబోతున్నారు మేకర్స్. అందులో భాగంగా.. కాస్త కాంట్రవర్సీ.. కొంచెం కన్నింగ్.. ఎక్కువగా కామెడీ.. అన్నీ కలగలిపేలా.. కంటెస్టెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారట టీమ్. అందుకే రోజుకో పేరు ఈ లిస్ట్ లో వినిపిస్తుంది.  ఇప్పటికే కంటెస్టెంట్స్ రెడీ అయిపోయారు.. ఇదిగో వీరే అంటూ సోషల్ మీడియాలో లిస్ట్ కూడా వైరల్ అవుతుంది. ఫలానా స్టార్ బిగ్ బాస్ లోకి అంటూ.. పేర్లు వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఈసారి షో ఎలా  ఉంటుందో చూడాలి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios