బిగ్ బాస్ హౌస్ లో లవర్ బాయ్ ఇమేజ్ కొనసాగిస్తున్నారు అఖిల్, అభిజిత్. ఈ సీజన్ కి ఎంపికైన సభ్యులలో వీరిద్దరి స్టోరీ ఆసక్తికరం అని చెప్పాలి. షో మొదలు కావడంతోనే ఇంటిలో ఉన్న టాప్ ఫిగర్ పై వీరిద్దరి కన్ను పడింది. మోనాల్ కోసం అఖిల్, అభిజిత్ పోటీ పడడం స్టార్ట్ చేశారు. మొదట్లో అభిజిత్ కి దగ్గరైన మోనాల్ చిన్నగా అఖిల్ తో సన్నిహితంగా ఉండడం స్టార్ట్ చేసింది. 

తాను ఇష్టపడిన మోనాల్ అఖిల్ కి దగ్గర కావడం అభిజిత్ కి నచ్చేది కాదు. ఐతే అఖిల్ లేని సమయంలో అభిజిత్ తో కూడా క్లోజ్ గా ఉండేది మోనాల్. అభిజిత్ కంటే కూడా మోనాల్ అఖిల్ కి దగ్గర కావడం జరిగింది. చివరికి మోనాల్ ని అఖిల్ నామినేట్ చేసినా అతనికి మంచి జరిగేలా మోనాల్ ప్రవర్తించింది. మోనాల్ ఇంత వరకు అఖిల్ ని నామినేట్ చేయలేదు. అలాగే అఖిల్ ఈ ఇంటిలో నా కుటుంబ సభ్యుడితో సమానం అని ఓపెన్ గా చెప్పేసింది. 

ఇక మోనాల్ తో వర్కవుట్ కాదనుకున్నాడేమో కానీ  అభిజిత్ తన ఫోకస్ హారిక పైకి మార్చాడు. ప్రస్తుతం హౌస్ లో అభిజిత్ మరియు హారిక మధ్య లవ్ డెవలప్ అయ్యింది. నిద్ర లేస్తూనే వీరిద్దరూ ఒకరికొకరు హగ్స్ తో రెచ్చిపోతున్నారు. బిగ్ బాస్ సాంగ్ తో నిద్రలేపగానే మోనాల్ వెళ్లి అఖిల్ ని హగ్ చేసుకుంటుంటే, హారిక వెళ్లి అభిజిత్ ని హగ్ చేసుకుంటుంది. అధికారికంగా హౌస్ లో రెండు లవ్ స్టోరీలు మాత్రం నడుస్తున్నాయి.