సామ్రాట్ రెడ్డి రెండవ వివాహం అత్యంత నిరాడంబరంగా, కేవలం బంధు మిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. బుధవారం హైదరాబాద్ లో ఈ వేడుక జరిగినట్లు సమాచారం. అంజనా శ్రీ లిఖిత అనే యువతి మెడలో సామ్రాట్ మూడు ముళ్ళు వేశారు. వీరిద్దరి ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా ...అనే వివరాలు తెలియాల్సి ఉంది. సామ్రాట్ సిస్టర్ శిల్పా రెడ్డి పెళ్లి ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అందరికీ ఈ పెళ్లి గురించి తెలిసింది. సామ్రాట్ పెళ్ళికి బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న తనీష్, దీప్తి సునయన హాజరయ్యారు. 

చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించిన సామ్రాట్ రెడ్డి వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరీ సినిమాలలో హీరోగా కూడా చేశారు. సామ్రాట్ నాని హోస్ట్ గా ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనడం జరిగింది. ఆ సీజన్ లో తన మార్కు గేమ్ తో విరాట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచారు. హౌస్ లో సాఫ్ట్ అండ్ జెంటిల్ ఫెలో గా పేరుతెచ్చుకున్న సామ్రాట్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలవడం విశేషం. 

సామ్రాట్ మొదటి భార్య హర్షితా రెడ్డి అతనిపై కట్నం కోసం వేధిస్తున్నాడని, కేసు పెట్టడం జరిగింది. 2018లో వీరి మధ్య విభేదాలు తెలెత్తగా, ఆ తదుపరి చట్ట పరంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఆమెతో విడిపోయిన రెండేళ్లకు సామ్రాట్ అంజనా శ్రీ లిఖిత అనే అమ్మాయిని ఈ బుధవారం పెళ్లి చేసుకున్నారు.