Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ ప్రోమో చూశారా? లోగో అదిరింది!  ఎప్పటి నుంచి అంటే?

బిగ్ బాస్ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 8 అప్డేట్ వచ్చేసింది. సీజన్ 8 ఫస్ట్ ప్రోమో విడుదల చేశారు. లోగో అదిరిపోగా లాంచింగ్ ఎప్పుడో తెలుసా.. 
 

bigg boss telugu 8 officially announced by host nagarjuna look at interesting first promo ksr
Author
First Published Jul 21, 2024, 4:57 PM IST | Last Updated Jul 21, 2024, 5:13 PM IST

బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్. గత ఆరు సీజన్స్ కి మించిన ఆదరణ బిగ్ బాస్ షోకి దక్కింది. బిగ్ బాస్ తెలుగు 6 ప్లాప్ అయిన నేపథ్యంలో...  సీజన్ 7 సరికొత్తగా రూపొందించారు. టాస్క్స్ , గేమ్స్ , ఎలిమినేషన్స్, కెప్టెన్ ఎంపిక గతానికి భిన్నంగా ప్లాన్ చేశారు. రెండు లాంచింగ్ ఈవెంట్స్ నిర్వహించడం కూడా టీఆర్పీ పరంగా కలిసొచ్చింది. కామనర్ కోటాలో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలవడం మరొక విశేషం. 

కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత మూడు నెలలుగా బిగ్ బాస్ 8పై అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. లాంచింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందని, కంటెస్టెంట్స్ వీరే అంటూ పలు కథనాలు వెలువడ్డాయి. ఫైనల్ గా అధికారిక ప్రకటన వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగు 8 ప్రోమో నాగార్జున స్వయంగా విడుదల చేశారు. నాగార్జున తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. 

మీకు తిరిగి వినోదం పంచేందుకు మేము వచ్చేశాము. బిగ్ బాస్ తెలుగు 8 లోగో గర్వంగా ప్రజెంట్ చేస్తున్నాము. అనంతమైన ఎంటర్టైన్మెంట్ ఆస్వాదిచేందుకు మీరు సిద్ధమా.. అని నాగార్జున రాసుకొచ్చారు. బిగ్ బాస్ తెలుగు 8 లోగో చాలా కలర్ ఫుల్ గా ఉంది. నెంబర్ 8ని ఇన్ఫినిటీ ని తలపించేలా డిజైన్ చేశారు. మధ్యలో ఒక పువ్వును మనం చూడొచ్చు. లోగోలోనే మనకు అర్థం కానీ కొన్ని సంగతులు పొందుపరిచారు. అవి మెల్ల మెల్లగా బయటకు వస్తాయి. 

అయితే లాంచింగ్ ఎపిసోడ్ ఎప్పుడు అనేది చెప్పలేదు. త్వరలో అని కేవలం లోగోతో కూడిన ప్రోమో విడుదల చేశారు. జులై లో ప్రేమో వచ్చిందంటే ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారం బిగ్ బాస్ సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ కి ముహూర్తం కుదిరి ఉండవచ్చు. ఇక కంటెస్టెంట్స్ వీరే అంటూ ఒక లిస్ట్ ప్రచారంలో ఉంది. 

బర్రెలక్క, కుమారీ ఆంటీ, యూట్యూబర్ బంచిక్ బబ్లు, నటి హేమ, నటి సురేఖావాణి, సోనియా సింగ్, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, వర్షిణి సుందరరాజన్, రీతూ చౌదరి, అంబటి రాయుడు, వేణు స్వామి, అమృత ప్రణయ్... బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. కన్నడ నటి ప్రేరణ ఖన్నా హౌస్లోకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రోమోతో ఒక క్లారిటీ అయితే వచ్చింది. కింగ్ నాగార్జున మరోసారి హోస్టింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు.. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios