బిగ్ బాస్ నిర్వాహకు సీజన్ 8 అంతకి మించేలా ఉండాలి అన్నట్లుగా అంతా సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ అయింది. వివాదాలు, హంగామాతో కంటెస్టెంట్స్ ఆడియన్స్ కి బాగా ఎంటెర్టైమెంట్ అందించారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి లాంటి కంటెస్టెంట్ బాగా హైలైట్ అయ్యారు. 

ఇక బిగ్ బాస్ నిర్వాహకు సీజన్ 8 అంతకి మించేలా ఉండాలి అన్నట్లుగా అంతా సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక శరవేగంగా జరుగుతోంది. అయితే కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ 8 కి హోస్ట్ లో మార్పు ఉండొచ్చు అంటూ అనుమానాలు వినిపించాయి. 

కానీ ఆ అనుమానాలు తొలగిపోయినట్లే కనిపిస్తున్నాయి. ఈసారి కూడా నాగార్జునే రంగంలోకి దిగుతున్నారు. అతి త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండబోతోంది. గత సీజన్ల కంటే ఈసారి నాగార్జున భారీ పారితోషికం అందుకోబోతున్నట్లు కూడా తెలుస్తోంది 

అదే విధంగా బిగ్ బాస్ హౌస్ లో ఈ సారి చాలా రూల్స్ మారబోతున్నాయట. హౌస్ లో కంటెస్టెంట్స్ పాటించాల్సిన రూల్స్ తో పాటు.. ఎలిమినేషన్ రూల్స్ కూడా మారనున్నాయట. అన్ని విషయాలని త్వరలోనే బిగ్ బాస్ నిర్వాహకులు ప్రకటించబోతున్నారు. షోలో ఈ సారి ఎక్కువగా యువతకి ప్రాధాన్యాత ఇవ్వబోతున్నారట. లాంచ్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.