Asianet News TeluguAsianet News Telugu

హౌస్ మేట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్... ప్రియాంకకు కెప్టెన్ అయ్యే అర్హత లేదన్న యావర్!

బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇది ఫైనల్ దశకు చేరుకోగా ఎవరిని కెప్టెన్ చేయాలో నిర్ణయించే బాధ్యత ఇంటి సభ్యులకే ఇచ్చాడు బిగ్ బాస్. 
 

bigg boss telugu 7 who will be the next captain of the house ksr
Author
First Published Oct 20, 2023, 11:33 AM IST

పల్లవి ప్రశాంత్ గత వారం కెప్టెన్ కాగా... ప్రిన్స్ యావర్ ప్రస్తుతం ఇంటి కెప్టెన్ గా ఉన్నాడు. నెక్స్ట్ కెప్టెన్ కోసం బిగ్ బాస్ టాస్క్స్ నిర్వహిస్తున్నాడు. ఇంటి సభ్యులను గులాబీ పురం, జిలేబి పురం గ్రామస్థులుగా విభజించాడు. గులాబీ పురం టీమ్ లో శోభా, తేజా, యావర్, అమర్, పూజా, గౌతమ్ ఉన్నారు. ఇక జిలేబి పురం టీమ్ లో శివాజీ, ప్రియాంక, అర్జున్, ప్రశాంత్, అశ్విని, సందీప్ ఉన్నారు. భోలే మధ్యలో న్యూట్రల్. 

ఈ రెండు టీమ్స్ మధ్య పోటీలు జరిగాయి. ఎక్కువ టాస్క్స్ లో గెలిచిన జిలేబి పురం టీమ్ విజేతగా నిలిచారు. కాబట్టి ఈ టీం సభ్యుల్లో ఒకరు ఇంటి కెప్టెన్ అవుతారు. గెలిచిన టీమ్ లో ఎవరికి కెప్టెన్ అయ్యే అర్హత లేదో చెప్పి కెప్టెన్సీ రేసు నుండి తప్పించే బాధ్యత ఓడిపోయిన గులాబీ పురం టీమ్ సభ్యులకు ఇచ్చాడు బిగ్ బాస్. కారణాలు చెప్పి అర్హత లేదని భావిస్తున్న సభ్యుడి ఫోటో స్విమ్మింగ్ పూల్ లో వేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. 

శోభా శెట్టి... అశ్వినికి అర్హత లేదని స్విమ్మింగ్ పూల్ లో ఫోటో వేసింది. పూజా మూర్తి... పల్లవి ప్రశాంత్ కి అర్హత లేదని చెప్పి అతన్ని డిస్ క్వాలిఫై చేసింది. ప్రిన్స్ యావర్... ప్రియాంకను కెప్టెన్సీ రేసు నుండి తప్పించాడు. అమర్ ప్రతి గొడవలో నువ్వు తలదూర్చుతున్నావు. అందుకే నీకు అర్హత లేదన్నాడు. నేను సోలోగా వచ్చాను, సోలోగా ఆడుతున్నానని ప్రియాంక సీరియస్ అయ్యింది. ఇక అమర్.. శివాజీ పేరు చెప్పాడు. దీంతో రేసులో సందీప్, అర్జున్ నిల్చినట్లు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సందీప్ ఈ వారం హౌస్ కెప్టెన్ అయ్యాడట. 

Follow Us:
Download App:
  • android
  • ios