మైండ్ బ్లాక్ చేస్తున్న ఓటింగ్ రిజల్ట్... ఆ భారీ తిమింగలం హౌస్ నుండి అవుట్!


బిగ్ బాస్ తెలుగు 7 మరో వీకెండ్ కి దగ్గరైంది. ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరగనున్నట్లు సమాచారం అందుతుంది. 
 

bigg boss telugu 7 this top contestant to be eliminated this week ksr

గత వారం సీరియల్ నటి పూజ మూర్తి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక 8వ వారానికి శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, అశ్విని, భోలే, గౌతమ్, సందీప్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు నెక్స్ట్ సండే హౌస్ వీడాల్సి ఉంది. మంగళవారం నుండి ఓటింగ్ మొదలైంది. అనుకున్నట్లే శివాజీ ఓటింగ్ లో జోరు చూపిస్తున్నాడు. శివాజీ ఒక్కడికే 45% శాతం ఓట్లు పోలైనట్లు సమాచారం. అనూహ్యంగా రెండో స్థానంలో భోలే ఉన్నాడట. ఇది నిజంగా ఊహించని పరిణామం. సీరియల్ బ్యాచ్ చే టార్గెట్ చేయబడ్డ భోలే రెండో స్థానం దక్కించుకోవడం షాక్ కి గురి చేస్తుంది. 

ఇక మూడో స్థానంలో అమర్ దీప్, నాలుగో స్థానంలో అశ్విని ఉన్నారట. ఐదవ స్థానంలో గౌతమ్, ఆరో స్థానంలో ప్రియాంక ఉన్నారట. చివరి రెండు స్థానాల్లో సందీప్, శోభా ఉన్నారట. వీరిద్దరి మధ్య ఓట్లలో పెద్ద తేడా లేదంటున్నారు. ఇప్పటి వరకు చూస్తే శోభా అట్టడుగు స్థానంలో ఉందట. ఆమెను అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయట. 

కొన్ని వారాలుగా శోభా గేమ్, ప్రవర్తన ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తున్నాయి. ఆమె విలనీ ఎక్సప్రెషన్స్, నేను ఇంతే అనే యాటిట్యూడ్ ప్రేక్షకుల్లో నెగిటివిటీకి కారణమైంది. మనం ఏం చేసినా హౌస్లో ఉంటాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఆమెలో కనిపిస్తుంది. ఇవన్నీ వెరసి శోభా శెట్టికి ఓట్లు పడలేదట. ఆమె నామినేషన్స్ లో ఎప్పుడు వస్తుందా అని చూస్తున్న జనం తొక్కిపడేశారని సోషల్ మీడియా టాక్. 

ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయం అంటున్నారు. ఇక కెప్టెన్సీ కంటెండర్ రేసులో ప్రశాంత్, సందీప్, శోభా, ప్రియాంక, గౌతమ్ ఉన్నారు. వీరిలో ఎవరు కెప్టెన్ అయ్యేది ఇంటి సభ్యులు నిర్ణయించాల్సి ఉంది. గౌతమ్ కెప్టెన్ అయినట్లు సమాచారం... 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios