Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7:నామినేషన్స్ లో 6గురు... తేజాను సేవ్ చేసేందుకు శోభా ప్రయత్నం, ఈ వారం మేల్ కంటెస్టెంట్ అవుట్?


నాలుగో వారానికి నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ ఎలా సాగిందో చూద్దాం.. 
 

bigg boss telugu 7 this six top contestants in nominations ksr
Author
First Published Sep 27, 2023, 12:07 AM IST

సోమవారం ఎపిసోడ్లో ప్రియాంక, రతికా రోజ్ నామినేట్ అయ్యారు. వాళ్ళను నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ అభిప్రాయాలతో ఏకీభవించిన జ్యూరీ సభ్యులు వాళ్ళను గిల్టీ లిస్ట్ లో చేర్చారు. అక్కడి నుండి ఎలిమినేషన్ ప్రక్రియ మంగళవారం మొదలైంది. గౌతమ్ కృష్ణ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ ని బోనులో నిలబెట్టి నామినేట్ చేశాడు. శివాజీ గౌతమ్ చెప్పిన పాయింట్ కి సంతృప్తి చెందలేదు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శివాజీ మీదకు గౌతమ్ నువ్వు ఎవరంటూ దూసుకుపోయాడు. 

ఈ వాదనలో గౌతమ్ గెలిచాడు. ప్రిన్స్ యావర్ ని జ్యూరీ సభ్యులు నామినేట్ చేశారు. అనంతరం వచ్చిన అమర్ దీప్ చౌదరి పల్లవి ప్రశాంత్, శుభశ్రీలను నామినేట్ చేశాడు. పల్లవి ప్రశాంత్ కి రెండు ముఖాలు. అసలైన పల్లవి ప్రశాంత్ బయటకు రావాలన్నాడు. అందుకు నేను బరా బర్ ఇలానే ఉంటా అంటూ పల్లవి ప్రశాంత్ సమాధానం చెప్పాడు. ప్రియాంక కంటెండర్ గా నాట్ ఎలిజిబుల్ అని నామినేట్ చేస్తే... డిపెండ్ చేసుకోలేకపోయావ్, గేమ్ ఆడలేదని అమర్ దీప్ ని నామినేట్ చేసింది. 

అదే పాయింట్ ని రివర్స్ చేసి అమర్ దీప్ లేడీ కంటెస్టెంట్ శుభశ్రీని నామినేట్ చేశాడు. జ్యూరీ సభ్యులు కూడా అంగీకరించడంతో శుభశ్రీ తట్టుకోలేకపోయింది. నన్ను ఇలాంటి రీజన్ తో నామినేట్ చేయడం సరికాదని ఆమె అన్నారు. ఈ ఎపిసోడ్లో రతికా రోజ్-పల్లవి ప్రశాంత్ గొడవ హైలెట్ అయ్యింది. గౌతమ్ కృష్ణను పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. అందుకు కారణంగా... శోభా శెట్టి ముందు చొక్కా విప్పడం నచ్చలేదన్నాడు. ఆమె గట్టిగా అరిచింది,మీరు గట్టిగా అరిచారు. అంత వరకూ ఓకే కానీ ఆడ పిల్ల ముందు చొక్కా విప్పడం బాగోలేదు అన్నాడు.

దానికి రతికాను లైన్లోకి తెచ్చాడు గౌతమ్. మళ్ళీ చొక్కా విప్పేసిన గౌతమ్ నేను హౌస్లో ఇలానే తిరుగుతా, నా బాడీ నా ఇష్టం అన్నాడు. అలాగే రతికా బట్టల మీద నువ్వు ఎందుకు కామెంట్ చేశావని అన్నాడు. మరీ ఇంత పొట్టి బట్టలు ఎందుకు ధరిస్తున్నావని రతికాను అన్నావా లేదా అన్నాడు. నా బట్టల మీద కామెంట్ చేయడానికి నువ్వు ఎవడు అని రతికా లేచింది. 

అసలు నా ప్రాపర్టీ అనే పదం ఎలా వాడతావు. నోటికి వచ్చింది వాగొద్దని ఫైర్ అయ్యింది. ఫ్రెండ్ కాబట్టి మజాక్ చేశాను అన్నాడు. అసలు నాతో నీకు మజాక్ ఏంటి? నువ్వు అసలు ఎవడ్రా బాయ్? అంటూ పల్లవి ప్రశాంత్ ని ఏకిపారేసింది. వాదన చివర్లో రతికాకు లైన్ వేసే పల్లవి ప్రశాంత్ అక్క అనేశాడు. ఇది హైలెట్ అనాలి. నామినేషన్స్ ప్రక్రియ వాదనల మధ్య ముగిసింది. ప్రియాంక, రతికా రోజ్, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ నామినేషన్స్ లో లేని అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, తేజాలలో ఒకరిని నామినేట్ చేయాలనీ జ్యూరీ సభ్యులను కోరారు. 

సందీప్, శివాజీ కలిసి.. తేజాను ఎంపిక చేశారు. తేజాను తప్పించేందుకు జ్యూరీ మెంబర్ గా ఉన్న శోభా గట్టిగా ట్రై చేసింది. కానీ వాళ్ళు కన్విన్స్ కాలేదు. దాంతో 4వ వారానికి ప్రియాంక, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్, రతికా రోజ్, తేజా నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios