Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌస్ నెక్స్ట్ కెప్టెన్ ఎవరంటే...?
బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్స్ జరుగుతున్నాయి. ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండు టీమ్స్ గా విభజించి గేమ్స్ నిర్వహిస్తున్నాడు.

గులాబీ పురం, జిలేబీ పురం గ్రామాల మధ్య ఏలియన్స్ స్పేస్ షిప్ కూలిపోయింది. అందులో ఉన్న ఏలియన్స్ ని ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత గులాబీ పురం, జిలేబీపురం గ్రామస్థులది. వారిని మెప్పించిన గ్రామం నుండి ఒకరు కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. గులాబీ పురం టీమ్ లో తేజా, శోభా, యావర్, గౌతమ్, పూజా, అమర్ దీప్ ఉన్నారు. వారికి కొన్ని గ్రామీణ పాత్రలు ఇచ్చారు. ఇక జిలేబీ పురంలో మిగిలిన శివాజీ, ప్రియాంక, అశ్విని, సందీప్, ప్రశాంత్ ఉన్నారు. భోలే రెండు గ్రామాలకు చెందిన జ్యోతిష్కుడిగా నిర్ణయించారు.
వీరు తమ పాత్రల్లో నటిస్తూ ఏలియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. అదే సమయంలో సమయానుసారం బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లలో పాల్గొనాలి. మొదట గుడ్డు టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో జిలేబీ పురం గెలిచింది. స్విమింగ్ పూల్ టాస్క్ లో కూడా జిలేబీ పురం గెలిచి లీడ్ లోకి వెళ్ళింది. టాస్క్స్ మొత్తం ముగిశాక లీడ్ లో ఉన్న టీమ్ సభ్యుల మధ్య చివరి పోటీ ఉంటుంది. వారిలో గెలిచిన ఒకరు కెప్టెన్ అవుతారు.
జిలేబీ పురం టీమ్ పైచేయి సాధించినట్లు తెలుస్తుండగా.. ఈ టీమ్ సభ్యుడిగా ఉన్న సందీప్ కెప్టెన్ అయ్యాడని టాక్. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. సందీప్ కెప్టెన్ అయితే అతనికి విఐపీ రూమ్ దక్కుతుంది. లగ్జరీలతో పాటు ఒక వారం ఇమ్యూనిటీ లభిస్తుంది. ఇక సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. రెండో కెప్టెన్ గా యావర్ గెలిచాడు.