Bigg Boss Telugu 7: ఆ నలుగురి త్యాగం... బిగ్ బాస్ హౌస్ మొదటి కెప్టెన్?
బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. కెప్టెన్సీ కంటెండర్ రేస్ చివరి దశకు చేరుకోగా ఆ నలుగురిలో ఒకరు కెప్టెన్ కానున్నారు.
బిగ్ బాస్ తెలుగు 7 ఐదో వారం నడుస్తుంది. పవర్ అస్త్ర టాస్క్ పక్కన పెట్టి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ తెరపైకి తెచ్చాడు బిగ్ బాస్. ఇప్పటి వరకు హౌస్ కి కెప్టెన్ లేడు. ఇక కెప్టెన్ కావడం ప్రెస్టీజ్ గా కంటెస్టెంట్స్ భావిస్తారు. టైటిల్ కొట్టినా కొట్టకున్నా హౌస్లో ఉన్నన్ని రోజుల్లో ఒక్క వారమైనా కెప్టెన్ గా చేయాలని ఆశపడతారు. సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ ఎవరవుతారనే సందిగ్ధత నెలకొంది. బిగ్ బాస్ పది మంది కంటెస్టెంట్స్ ని ఇద్దరు చొప్పున ఐదు టీమ్స్ గా చేసిన విషయం తెలిసిందే.
వీరిలో ప్రియాంక-శోభా టీమ్ ఆల్రెడీ రేసు నుండి తప్పుకున్నారు. మిగిలిన నాలుగు టీమ్స్ కి బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు. చిట్టీ ఆయీ.. టాస్క్ లో భాగంగా కుటుంబ సభ్యుల నుండి లెటర్స్ వచ్చాయి. ప్రతి టీమ్ లో ఒకడు మాత్రమే ఆ లెటర్ తీసుకోవాలి. మరొకరు త్యాగం చేయాలి. త్యాగం చేసిన కంటెస్టెంట్ కుటుంబ సభ్యులు పంపిన లేఖ చదవలేడు. అలాగే కెప్టెన్సీ రేసు నుండి తప్పుకోవాలి.
శోభా, ప్రిన్స్ యావర్, శివాజీ, అమర్ దీప్ తమ లెటర్స్ త్యాగం చేసి రేసు నుండి తప్పుకున్నారు. వీరి టీమ్ మేట్స్ అయిన గౌతమ్, తేజా, పల్లవి ప్రశాంత్, సందీప్ కెప్టెన్సీ రేసుకు సిద్ధమయ్యారు. అయితే చిట్టీ ఆయీ టాస్క్ ఎమోషనల్ గా సాగింది. కంటెస్టెంట్స్ బాగా ఏడ్చేశారు.
ఇదిలా ఉంటే.. ఒకేసారి 5గురు కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశ పెడుతున్నారు. అక్టోబర్ 8 ఆదివారం మరో లాంచింగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. గతంలో ఎన్నడూ చేయని ఈ ప్రయోగం ప్రేక్షకులకు కిక్ ఇవ్వనుందని అంటున్నారు. సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షామిలి, సీరియల్ నటి అంజలి పవన్, సీరియల్ నటి నయని పావని వైల్డ్ కార్డు లిస్ట్ లో ఉన్నారట.
అయితే వీరి నుండి అంజలి పవన్ చివరి నిమిషంలో తప్పుకున్నట్లు సమాచారం. దీంతో జబర్దస్త్ స్టార్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ని లైన్లోకి తెచ్చారట. కెవ్వు కార్తీక్ బిగ్ బాస్ షోకి వెళ్లడం దాదాపు ఖరారైందని టాక్. గతంలో పలువురు జబర్దస్త్ కమెడియన్స్ బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. ముక్కు అవినాష్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేశాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అవినాష్ హౌస్లో సక్సెస్ఫుల్ జర్నీ సాగించాడు. చాలా వారాలు ఉన్నారు.
ఇక గత సీజన్లో ఇద్దరు జబర్దస్త్ కమెడియన్స్ హౌస్లోకి వెళ్లారు. చలాకీ చంటి, ఫైమా కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అంచనాల మధ్య అడుగుపెట్టిన చలాకీ చంటి ఫెయిల్ కాగా, రెండు మూడు వారాలు ఉండటం కష్టం అనుకున్న ఫైమా దుమ్ము రేపింది. ఫైనల్ కి వెళ్ళకున్నా చివరి వరకు ఉంది. మరి కెవ్వు కార్తీక్ హౌస్లో అడుగుపెట్టడం నిజమైతే ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాలి. ఇక ఈ వారం డబల్ ఎలిమినేషన్ అంటున్నారు.