Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: ఓటింగ్ తారుమారు, తిరుగులేని రైతుబిడ్డ... ఈ వారం ఆ కంటెస్టెంట్ అవుట్!

బిగ్ బాస్ తెలుగు 7 మరో వీకెండ్ కి చేరువైంది. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ గుండెల్లో గుబులు మొదలైంది. ఓటింగ్ లో వెనుకబడ్డ ఆ కంటెస్టెంట్ అవుట్ అంటున్నారు. 
 

bigg boss telugu 7 shocking voting this contestant will be out ksr
Author
First Published Oct 20, 2023, 12:44 PM IST

తాజా సీజన్ సక్సెస్ ఫుల్ గా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికి ఆరుగురు కంటెస్టెంట్స్ ఇంటిని వీడారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ, నయని పావని వారం చొప్పున ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఏడుగురు నామినేట్ అయ్యారు. సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రాసెస్ మంగళవారం ముగిసింది. అశ్విని, భోలేలను మెజారిటీ ఇంటి సభ్యులు నామినేట్ చేశారు. అమర్ దీప్, గౌతమ్, పల్లవి ప్రశాంత్, అశ్విని, భోలే, పూజా, తేజా నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. 

ఒక ఓటింగ్ తారుమారు అయినట్లు సమాచారం. ఒక్క రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ స్థానాలు మాత్రమే స్థిరంగా ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ పై సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. హౌస్ మేట్స్ లో కూడా కొందరు అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆడియన్స్ లో అతడికి ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. పల్లవి ప్రశాంత్ 40 శాతానికి పైగా ఓటింగ్ తో ముందంజలో ఉన్నాడట. 

రెండో స్థానంలో అమర్ దీప్ కొనసాగుతున్నాడట. మూడో స్థానంలో ఉన్న భోలే ఐదో స్థానానికి పడిపోయాడట. గౌతమ్ తేజా కంటే వెనుకబడ్డాడట. తేజా మూడో స్థానంలో ఉండగా... గౌతమ్ నాలుగో స్థానంలో ఉన్నాడట. లేడీ కంటెస్టెంట్స్ అశ్విని ఆరో స్థానంలో, పూజా మూర్తి ఏడో స్థానంలో ఉన్నారట. శుక్రవారంతో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మరి ఇదే ట్రెండ్ కొనసాగితే... పూజా మూర్తి ఎలిమినేట్ కావడం ఖాయం. 

మరోవైపు శుభశ్రీ, దామిని, రతికా రోజ్ లలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు నాగార్జున చెప్పాడు. ఇంట్లోకి ఎవరు రావాలో హౌస్ మేట్స్ ఈ ముగ్గురికి ఓట్లు వేశారు. అయితే ట్విస్ట్ ఇస్తూ తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకు ఛాన్స్ అన్నారు. ఈ క్రమంలో రతికా రోజ్ రీఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios