Bigg Boss Telugu 7: మారని శోభా తీరు... అర్జున్ పై బుసలు కొట్టిన లేడీ విలన్!
శోభా శెట్టి హౌస్లో అదే తలబిరుసు తనం చూపిస్తుంది. తనని నామినేట్ చేస్తే ఆమె అసలు తీసుకోలేదు. ఈసారి అర్జున్ ఆమెను నామినేట్ చేయగా విరుచుకుపడింది.

సోమవారం కావడంతో హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ప్రతి ఇంటి సభ్యులు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేయబడ్డ ముఖం మీద డ్రాగన్ స్నేక్ రంగు చిమ్ముతుంది. తనని కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించినందుకు ప్రశాంత్... అమర్ దీప్, తేజలను నామినేట్ చేశాడు. ప్రియాంక రతిక, భోలేలను నామినేట్ చేసింది.
అర్జున్ ఈసారి శోభాను నామినేట్ చేశాడు. మజాక్ మనకేమో కానీ ప్రేక్షకులకు కాదు. ఇప్పటి నుండైనా చూసి ఆడు అని చెప్పాడు. దానికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు అంటూ ఫైర్ అయ్యింది. బిగ్ బాస్ అర్జున్ ని తీసుకొస్తాను. బ్లాక్ కలర్ రెడీ చేసుకో అని పొగరుగా మాట్లాడింది. శోభా శెట్టికి నాగార్జున శనివారం వార్నింగ్ ఇచ్చాడు. యావర్ ని పిచ్చోడు అనడంతో అది సరికాదని హెచ్చరించాడు. నువ్వు టెంపర్ కోల్పోతున్నావు. అప్పుడు ఏది పడితే అది మాట్లాడుతున్నావని హితవు పలికాడు.
శోభా శెట్టిలో ఎలాంటి మార్పు వచ్చిన సూచనలు కనిపించడం లేదు. కాగా 9వ వారం నామినేషన్స్ లిస్ట్ లీకైంది. 8 మంది లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. తేజ, అమర్ దీప్, శోభ, ప్రియాంక, భోలే, రతిక, యావర్, అర్జున్ నామినేట్ అయ్యారట. వీరిలో ఒకరు హౌస్ వీడనున్నారనేది సమాచారం. ఈ వారం సందీప్ ఎలిమినేటైన విషయం తెలిసిందే...