Bigg Boss Telugu 7: నామినేషన్స్ లీక్... 2వ వారం లిస్ట్ లో టాప్ కంటెస్టెంట్స్!
సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్ కి కంటిన్యూ కానుంది. అయితే ఇప్పటికే నామినేషన్స్ ముగియగా.. లిస్ట్ బయటకు వచ్చింది.

14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు 7 ప్రారంభమైంది. ప్రియాంక సింగ్, శివాజీ, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, దామిని, షకీలా, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజా, శుభశ్రీ, రతికా రోజ్, ఆట సందీప్, గౌతమ్ కృష్ణ కంటెస్టెంట్స్ గా హౌస్లో అడుగుపెట్టారు. మొదటివారం 8 మంది నామినేట్ కాగా వారిలో కిరణ్ రాథోడ్ ఒకరు. ఆమెకు తక్కువ ఓట్లు పోల్ కావడంతో ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
ఇక సోమవారం 2వ వారానికి ఎలిమినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఆట సందీప్ పవర్ అస్త్ర గెలుచుకున్నాడు. దీంతో 5 వారాల ఇమ్యూనిటీ అతనికి దక్కింది. అంటే అతన్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. ఆట సందీప్ మాత్రం ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ప్రిన్స్ యావర్ ని సందీప్ నామినేట్ చేశాడు. ఒక కంటెస్టెంట్స్ ని పలువురు నామినేట్ చేసే అవకాశం ఉంది. దామినిని ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారని బిగ్ బాస్ అడిగారు. ఏ ఒక్కరూ దామినిని నామినేట్ చేసేందుకు ముందుకు రాలేదు.
దాంతో దామిని ఈ వారానికి సేఫ్. శివాజీని అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి, దామిని నామినేట్ చేశారు. పల్లవి ప్రశాంత్ ని గౌతమ్ కృష్ణ, తేజా, ప్రియాంక, షకీలా, అమర్ దీప్ నామినేట్ చేశారు. రతికా రోజ్ ని గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడు. శోభా శెట్టిని శివాజీ నామినేట్ చేశాడు. నామినేషన్ ప్రక్రియ ఈ రోజు ఎపిసోడ్ తో ముగియనుంది.
అయితే లిస్ట్ లీక్ అయ్యింది. 2వ వారం 7 మంది కంటెస్టెంట్స్ నామిషన్స్ లో ఉన్నారట. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, రతికా రోజ్, శోభా శెట్టి, అమర్ దీప్ చౌదరి, శివాజీ, టేస్టీ తేజలు నామినేషన్స్ లో ఉన్నారట. ఫస్ట్ వీక్ నామినేషన్ లో లేని శివాజీ, అమర్ దీప్ చౌదరి, తేజా నామినేషన్స్ లోకి వచ్చారు. శివాజీ, అమర్ దీప్ టాప్ సెలెబ్స్ కాగా షాకింగ్ ఎలిమినేషన్ ఉండే అవకాశం లేకపోలేదు.