Bigg Boss Telugu 7: రతికా పొట్టిబట్టలపై రచ్చ... పల్లవి ప్రశాంత్ ని ఇరికించేసిన గౌతమ్!
రతికా కారణంగా పల్లవి ప్రశాంత్ ఇప్పటికే ఒకటి రెండు సార్లు బుక్ అయ్యాడు. ఈసారి దారుణంగా బలి అయ్యాడు. రతికా బట్టలపై కామెంట్స్ చేశాడని గౌతమ్ పాయింట్ తేవడంతో వివాదానికి దారి తీసింది.

రతికా రోజ్ తో దోస్తీ పల్లవి ప్రశాంత్ ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అనవసరంగా మరోసారి బలి అయ్యాడు. ఒక ఆడపిల్ల బట్టలపై తప్పుడు కామెంట్స్ చేశాడనే కోణంలో అతడు ప్రొజెక్ట్ అయ్యాడు. హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. గౌతమ్ కృష్ణను పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. అందుకు కారణంగా... శోభా శెట్టి ముందు చొక్కా విప్పడం నచ్చలేదన్నాడు. ఆమె గట్టిగా అరిచింది,మీరు గట్టిగా అరిచారు. అంత వరకూ ఓకే కానీ ఆడ పిల్ల ముందు చొక్కా విప్పడం బాగోలేదు అన్నాడు.
దానికి రతికాను లైన్లోకి తెచ్చాడు గౌతమ్. మళ్ళీ చొక్కా విప్పేసిన గౌతమ్ నేను హౌస్లో ఇలానే తిరుగుతా, నా బాడీ నా ఇష్టం అన్నాడు. అలాగే రతికా బట్టల మీద నువ్వు ఎందుకు కామెంట్ చేశావని అన్నాడు. మరీ ఇంత పొట్టి బట్టలు ఎందుకు ధరిస్తున్నావని రతికాను అన్నావా లేదా అన్నాడు. నా బట్టల మీద కామెంట్ చేయడానికి నువ్వు ఎవడు అని రతికా లేచింది.
అసలు నా ప్రాపర్టీ అనే పదం ఎలా వాడతావు. నోటికి వచ్చింది వాగొద్దని ఫైర్ అయ్యింది. ఫ్రెండ్ కాబట్టి మజాక్ చేశాను అన్నాడు. అసలు నాతో నీకు మజాక్ ఏంటి? నువ్వు అసలు ఎవడ్రా బాయ్? అంటూ పల్లవి ప్రశాంత్ ని ఏకిపారేసింది. చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ కి అంత మెచ్యూరిటీ లేదని అర్థమవుతుంది. లౌక్యంగా గేమ్ ఆడే విధానం తెలియక వాళ్లకు దొరికిపోతున్నాడు
ఈ నామినేషన్స్ లో అమర్ దీప్-శుభశ్రీ మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వు గేమ్ ఆడలేదు. అందుకే నామినేట్ చేశాను అని శుభశ్రీ చెప్పింది. ఆల్రెడీ నేను ఒప్పుకున్నాను. నువ్వు పదే పదే అదే మాట చెప్పడం ఏంటని అమర్ దీప్ అన్నాడు. నేను ఆట ఆడను. నేను ఇంతే అంటూ అరిచేశాడు. ఇక నేటి ఎపిసోడ్తో ఈ వారం ఎవరు నామినేషన్స్ లో ఉన్నారో తేలనుంది.