Bigg Boss Telugu 7: దుమ్మురేపుతున్న శివాజీ శిష్యులు... కెప్టెన్ గా ప్రిన్స్ యావర్?
బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఆటగాళ్లు-పోటుగాళ్ళు టీమ్స్ నుండి ఒకరు కెప్టెన్ కానున్నారు. కాగా ఆటగాళ్లు టీమ్ కి చెందిన యావర్ కెప్టెన్ అయినట్లు సోషల్ మీడియా టాక్ .
బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ అవతరించాడు. ఆరో వారానికి అతడు కెప్టెన్ గా ఉన్నాడు. నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ టాస్క్స్ నిర్వహిస్తున్నాడు. ఇందుకు ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన కొత్త వాళ్లతో పాటు గౌతమ్ ని కలిపి ఒక టీమ్ గా నిర్ణయించాడు. ఈ టీమ్ కి పోటుగాళ్ళు అని పేరు పెట్టాడు. పాత ఇంటి సభ్యులను ఆటగాళ్లు అనే టీమ్ చేశాడు.
ఆరు టాస్కుల్లో చెరో మూడు టాస్క్స్ గెలిచారు. నిర్ణయాత్మక ఏడో టాస్క్ ఫిజికల్ ఇచ్చారు. ఇరు టీమ్స్ సభ్యులు గార్డెన్ ఏరియాలో రగ్బీ తరహా గేమ్ ఆడాలి. సిద్ధంగా ఉన్న రెండు టీమ్స్ బజర్ మోగిన వెంటనే మధ్యలో ఉన్న బంతిని తీసుకుపోయి ఒక బాస్కెట్ లో వేయాలి. ఈ టాస్క్ లో గెలిచిన టీం సభ్యుడు ఒకరు కెప్టెన్ అవుతారు.
అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం ప్రిన్స్ యావర్ సెకండ్ కెప్టెన్ గా అవతరించాడట. దీంతో శివాజీ శిష్యులు దుమ్మురేపుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. శివాజీకి ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ప్రియ శిష్యులు. పల్లవి ప్రశాంత్ కెప్టెన్ కావడంతో శివాజీ కృషి ఉంది. వరుసగా తనకు ఇష్టమైన వ్యక్తి కెప్టెన్ అయినట్లు అవుతుంది.
ఇక ఎలిమినేషన్స్ లో ఏడుగురు ఉండగా.... అందరికంటే టాప్ లో యావర్ దూసుకుపోతున్నాడట. అతడికి ముప్పై శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. ప్రిన్స్ తర్వాత రెండో స్థానంలో అమర్ దీప్ కొనసాగుతున్నాడు. అతడికి ఇరవై శాతం ఓట్ల వరకు వచ్చాయి. మూడో స్థానంలో టేస్టీ తేజా, నాలుగో స్థానంలో అశ్విని శ్రీ, ఐదో స్థానంలో నయని పావని ఉన్నారట.
చివరి రెండు స్థానాల్లో పూజా మూర్తి, శోభా శెట్టి ఉన్నట్లు సమాచారం. వైల్డ్ కార్డు ఎంట్రీల కంటే కూడా తక్కువ ఓట్లు తెచ్చుకున్న శోభా శెట్టి లీస్ట్ లో ఉన్నారట. పూజా-శోభా మధ్య ఒక శాతం ఓటింగ్ తేడా ఉందట. మరి ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే శోభా శెట్టి ఇంటికి పోవడం ఖాయం అంటున్నారు. కార్తీక దీపం సీరియల్ తో పాపులర్ అయిన శోభాకు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక గత ఐదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు.