శివాజీ ఆడట్లేదు ఆడిస్తున్నాడు, అమర్ క్యారెక్టర్ వదిలేశాడు... పూజ షాకింగ్ ఆరోపణలు!
గత వారం ఎలిమినేటైన పూజ మూర్తి తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన పూజ మూర్తి బిగ్ బాస్ జర్నీ రెండు వారాలకే ముగిసింది. ఈ రెండు వారాలు పూజ మూర్తి ఆట పరిశీలిస్తే ఆమె సాఫ్ట్ గేమ్ ఆడారు. ఫిజికల్ టాస్క్ లలో ఇన్వాల్వ్ కాలేదు. వివాదాలకు చాలా వరకు దూరంగా ఉంది. సీరియల్ నటిగా ఫేమ్ ఉన్నప్పటికీ ఆమెకు ఓట్లు పడలేదు. ఆ కారణంగా ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన పూజను పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో హౌస్లో కంటెస్టెంట్స్ గేమ్, ప్రవర్తన గురించి ఆమె స్పందించారు. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ లను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. యావర్, పల్లవి ప్రశాంత్... శివాజీ సపోర్ట్ తో ఆడుతున్నాడని టాక్. మీరేమంటారు? అని అడగ్గా... యావర్, ప్రశాంత్ లకు శివాజీ సపోర్ట్ గా ఉన్నాడన్నది నిజం. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఎవరైనా కొంత పుష్ చేస్తారు. శివాజీ కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్లకు అండగా ఉంటున్నాడు.
శివాజీ గేమ్ ఆడటం లేదు. ఆడిస్తున్నాడు. మీరు గేమ్ ఆడటం లేదంటే ఒప్పుకోడు. అమర్ నాకు ముందే తెలుసు. నాకు తెలిసిన అమర్ వేరు, హౌస్లో అమర్ వేరు. తన ఒరిజినల్ క్యారెక్టర్ వదిలేశాడు. నేను అందగాడిని అని మురిసిపోయే అమర్ హౌస్లో పూర్తిగా డీలా పడిపోయాడు. అతనితో కలిసి పని చేశాను. అమర్ లో ఆత్మవిస్వాసం పూర్తిగా చచ్చిపోయింది... అని షాకింగ్ కామెంట్స్ చేసింది.