శివాజీకి కామన్ సెన్స్ లేదన్న శోభా, గుండెల్లో మంట ఆరదంటూ గౌతమ్ కి ప్రశాంత్ వార్నింగ్!
బిగ్ బాస్ సీజన్ 7లో 8వ వారానికి నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యుల మధ్య వాడి వేడి సంభాషణలు చోటు చేసుకున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 7 సక్సెస్ఫుల్ గా ఎనిమిదవ వారంలో అడుగుపెట్టింది. ఆదివారం ఎపిసోడ్లో కంటెస్టెంట్ పూజ మూర్తి ఎలిమినేట్ అయ్యింది. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన రతిక రోజ్ రీఎంట్రీ ఇచ్చింది. కంటెస్టెంట్స్ ఓటింగ్ ఆధారంగా ఆమెకు ఈ ఛాన్స్ దక్కింది. వరుసగా 7వ లేడీ హౌస్ మేట్స్ ఇంటిని వీడటం విశేషం. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన ముగ్గురు అమ్మాయిల్లో నయని పావని, పూజ ఎలిమినేట్ అయ్యారు.
ఇక ఈ వారానికి నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అర్జున్ అంబటి ఇంటి కెప్టెన్ కాగా అతడిని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. ప్రతి హౌస్ మేట్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేసిన హౌస్ మేట్ ఫోటో మంటల్లో కాల్చివేయాలి. శివాజీ... శోభా శెట్టిని నామినేట్ చేశాడు. భోలే అన్నమాట తప్పే. అతడు క్షమాపణలు కూడా చెప్పాడు. మనం మనుషులం ఒక చోట ఉంటున్నాం కాబట్టి క్షమించవచ్చు కదా అని నామినేట్ చేశాడు. నాకు దేవుడు క్షమించే మనసు ఇవ్వలేదని శోభా సమాధానం చెప్పింది.
శివాజీకి కనీసం కామన్ సెన్స్ లేదని అసహనం వ్యక్తం చేసింది. గతవారం ఎలిమినేషన్స్ లో పూజ మూర్తి చెప్పిన పాయింట్ మీద గౌతమ్ పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. ఆల్రెడీ ఒకసారి నువ్వు కెప్టెన్ అయ్యావని పూజ చెప్పింది. మరొకరికి ఛాన్స్ ఇస్తే తప్పేముందని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ ని ఆమె ఎలిమినేట్ చేసింది. ఇదే పాయింట్ మళ్ళీ గౌతమ్ తీశాడు. బుక్ లో ఏముందని? పల్లవి ప్రశాంత్ తిరిగి ప్రశ్నించాడు. గౌతమ్... ప్రశాంత్ ఫోటో కాల్చివేసి నామినేట్ చేశాడు.
ఆ మంటల్లో నా ఫోటో కాలిపోయినా గుండెల్లో మంట మాత్రం ఆరదు అని ప్రశాంత్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వారం కూడా ప్రియాంక.. భోలేని నామినేట్ చేసింది. భోలే బాడీ లాంగ్వేజ్ ని ఇమిటేట్ చేస్తూ తనకు నచ్చలేదని నామినేట్ చేసింది. అది నా డిఫన్స్, బాడీ లాంగ్వేజ్ నీకెందుకు అని భోలే ఎదురు ప్రశ్నించాడు. తాజా ప్రోమో ఈ ఆసక్తికర విషయాలతో కూడుకొని ఉంది. పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ ఎవరు ఎవరిని నామినేట్ చేశారో తెలియదు..