Bigg Boss Telugu: బిగ్ బాస్ షోకి జబర్దస్త్ కెవ్వు కార్తీక్... గ్రాండ్ వైల్డ్ గ్రాండ్ ఎంట్రీ!
బిగ్ బాస్ తెలుగు 7లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ సీజన్ 7లో ఊహించని పరిణామం చోటు చేసుకోనుంది . ఒకేసారి 5గురు కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశ పెడుతున్నారు. అక్టోబర్ 8 ఆదివారం మరో లాంచింగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. గతంలో ఎన్నడూ చేయని ఈ ప్రయోగం ప్రేక్షకులకు కిక్ ఇవ్వనుందని అంటున్నారు. సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షామిలి, సీరియల్ నటి అంజలి పవన్, సీరియల్ నటి నయని పావని వైల్డ్ కార్డు లిస్ట్ లో ఉన్నారట.
అయితే వీరి నుండి అంజలి పవన్ చివరి నిమిషంలో తప్పుకున్నట్లు సమాచారం. దీంతో జబర్దస్త్ స్టార్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ని లైన్లోకి తెచ్చారట. కెవ్వు కార్తీక్ బిగ్ బాస్ షోకి వెళ్లడం దాదాపు ఖరారైందని టాక్. గతంలో పలువురు జబర్దస్త్ కమెడియన్స్ బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. ముక్కు అవినాష్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేశాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అవినాష్ హౌస్లో సక్సెస్ఫుల్ జర్నీ సాగించాడు. చాలా వారాలు ఉన్నారు.
ఇక గత సీజన్లో ఇద్దరు జబర్దస్త్ కమెడియన్స్ హౌస్లోకి వెళ్లారు. చలాకీ చంటి, ఫైమా కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అంచనాల మధ్య అడుగుపెట్టిన చలాకీ చంటి ఫెయిల్ కాగా, రెండు మూడు వారాలు ఉండటం కష్టం అనుకున్న ఫైమా దుమ్ము రేపింది. ఫైనల్ కి వెళ్ళకున్నా చివరి వరకు ఉంది. మరి కెవ్వు కార్తీక్ హౌస్లో అడుగుపెట్టడం నిజమైతే ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాలి. ఇక ఈ వారం డబల్ ఎలిమినేషన్ అంటున్నారు.