బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ఈరోజు జరుగుతోంది. షోలో ప్రారంభంలో పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకు హౌజ్ లో ఇష్టమైన ప్లేస్ గురించి చెప్పే సమయంలో హార్ట్ టచ్ చేశారు.
Bigg Boss Telugu 7 Grand Finale సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుతున్నాయి. నాగర్జున్ ఫైనల్స్ లో మరింత జోష్ గా అదిరిపోయే డాన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. అలాగే హౌజ్ లోని ఎక్స్ కంటెస్టెంట్లు కూడా తమ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే టాప్ 6 కంటెస్టెంట్లు కూడా తమదైన శైలిలో పెర్ఫామ్ చేశారు. ఇక ఫినాలేకు టాప్ 6 కంటెస్టెంట్ల ఫ్యామిలీని కూడా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాగ్ హౌజ్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లను పలకరించారు. బిగ్ బాస్ ఇంట్లో తమకు నచ్చిన ప్లేస్ గురించి చెప్పాలని ఆదేశించారు. దీంతో పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) కాస్తా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకు నాగ్ సార్ ఇచ్చిన మొక్క దగ్గరే కూర్చుకుంటానని చెప్పి అందరీ హృదయాలను కదిలించాడు రైతుబిడ్డ. అలాగే రోజూ తన పొలం కాడికి వెళ్లే వాడినని.. ఆ విషయం గుర్తొచ్చి బాధనిపిస్తే మొక్క దగ్గర కూర్చునే వాడినని చెప్పారు. అలాగే హౌజ్ లో శివాజీ అన్నతో అన్నీ విషయాలను పంచుకునే వాడినని చెప్పారు.
ప్రశాంత్ కామెంట్స్ తన అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు నాగార్జున ప్రశాంత్ కు ఈ మొక్కను అందించారు. ఓసారి ఎండిపోయినా మరో మొక్కను ఇచ్చారు. అప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. అలాగే తన ఆటతీరుతోనూ ఫైనల్స్ వరకు చేరుకున్నారు. టైటిల్ రేసులో ముందున్నాడు రైతు బిడ్డ. తనే విజేత అంటున్నారు. చివరల్లో ఏం జరుగుతుందో చూడాలి.
