Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ ఫినాలేలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసే సెలబ్రిటీలు వీళ్ళే..గెస్ట్ గా వచ్చిన స్టార్ హీరో ఎవరంటే

గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ నుంచి పలువురు సెలెబ్రిటీలు అతిథులుగా హాజరైనట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu 7 grand finale dance performance by these celebrities dtr
Author
First Published Dec 16, 2023, 1:32 PM IST

100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన బిగ్ బాస్ తెలుగు 7సీజన్ ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. హౌస్ లో ఫైనలిస్టులుగా ఆరుగురు సభ్యులు ఉన్నారు. అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, అమర్ దీప్ టైటిల్ కోసం పోరాడుతున్నారు. బిగ్ బాస్ నుంచి అందుతున్న లీకుల ప్రకారం గ్రాండ్ ఫినాలే షూటింగ్ కూడా ఆల్రెడీ ముగిసింది. 

గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ నుంచి పలువురు సెలెబ్రిటీలు అతిథులుగా హాజరైనట్లు తెలుస్తోంది. శ్రీముఖి గురించి ముందు నుంచే వార్తలు వచ్చాయి. అలాగే కొంత మంది దర్శకులు కూడా హాజరయ్యారట. ఇక డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునేందుకు హీరోయిన్లు అవసరం. 

Bigg Boss Telugu 7 grand finale dance performance by these celebrities dtr

యంగ్ అండ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కళ్ళు చెదిరే విధంగా డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మాస్ మహారాజ్ రవితేజ గెస్ట్ గా హాజరయ్యారట. వీళ్ళతో పాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అశ్విని బోల్డ్ గా డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Bigg Boss Telugu 7 grand finale dance performance by these celebrities dtr

గౌతమ్, శుభశ్రీ, శోభా శెట్టి లాంటి కంటెస్టెంట్స్ ఆడియన్స్ చూపు తిప్పుకోలేని విధంగా కళ్ళు చెదిరే డ్యాన్స్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేశారట. ఆదివారం రోజు వీళ్ళ గ్లామర్, డ్యాన్స్ ప్రేక్షకులకు కనువిందు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజేత ఎవరనే విషయంలో సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉల్టా పల్టా అన్నట్లుగా ఫినాలే ఎపిసోడ్ లో సర్ప్రైజ్ లు ఏం జరిగాయి అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios