Asianet News TeluguAsianet News Telugu

అశ్విని శ్రీతో టేస్టీ తేజ చిలిపి కబుర్లు... ముద్దు పెట్టాలని బలవంతం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటున్నారు. తాజాగా టేస్టీ తేజ, అశ్వినిశ్రీ చేసిన వీడియో వైరల్ అవుతుంది. తేజ కామెంట్స్ కి నెటిజన్స్ అవాక్కయ్యారు. 
 

bigg boss telugu 7 ashwini sree shares romantic video with tasty teja ksr
Author
First Published Feb 25, 2024, 1:43 PM IST | Last Updated Feb 25, 2024, 1:43 PM IST

బిగ్ బాస్ తెలుగు 7 సూపర్ హిట్. భారీ టీఆర్పీ రాబట్టింది. ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటున్నారు. టేస్టీ తేజ తొమ్మిది వారాలు హౌస్లో ఉన్నాడు. అతడు బయటకు వచ్చాక తరచుగా ఫుడ్ వ్లాగ్స్ చేస్తున్నాడు. ఈసారి అశ్విని శ్రీతో కలిసి ఓ ఫుడ్ వ్లాగ్ చేశాడు. ఈ వీడియోలో వారి కామెంట్స్ చర్చకు దారి తీశాయి. 

తేజ మాట్లాడుతూ... ఇవి పాలు అనుకుంటున్నారా? కాదు పెరుగు. పాప పక్కనే ఉంటే పాలు అంటుకుంటున్నారేమో అని చెబుతున్నాను... అన్నాడు. టేస్టీ తేజ మాటలకు అశ్విని శ్రీ సిగ్గుపడిపోతూ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. టేస్టీ తేజ తన బుగ్గ తుడుచుకుంటూ... అశ్విని శ్రీ నుండి కిస్ ఎక్స్ పెక్ట్ చేశాడు. ఈ వీడియో అశ్విని శ్రీ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. 

అశ్విని శ్రీ... వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లో అడుగుపెట్టింది. ఆమె 12వ వారం ఎలిమినేట్ అయ్యింది. నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా అశ్విని శ్రీ సెల్ఫ్ నామినేట్ అయ్యింది. ఆ వారం రతిక రోజ్, అశ్విని శ్రీ ఎలిమినేట్ అయ్యారు. కాగా ఫినాలే రోజు అశ్విని శ్రీ కారు అద్దాలు కొందరు నాశనం చేశారు. దీనికి ఆమె ఎంతో బాధపడ్డారు. 

అశ్విని శ్రీ గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. సపోర్టింగ్ రోల్స్ చేసింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో అశ్విని శ్రీ హీరోయిన్ రష్మిక మందాన అక్క పాత్ర చేయడం విశేషం. ట్రైన్ సన్నివేశాల్లో అశ్విని శ్రీ కనిపించారు. అయితే బిగ్ బాస్ షోకి వచ్చాక... ఆమె నటించిన చిత్రాలు, చేసిన పాత్రలు వెలుగులోకి వస్తున్నాయి. అశ్విని శ్రీ కొన్ని ప్రాజెక్ట్స్ కి సైన్ చేసినట్లు సమాచారం.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios