Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ లీక్ నామినేషన్స్ లో ఆ ఏడుగురు... మరో సంచలన ఎలిమినేషన్ కి రంగం సిద్ధం!

బిగ్ బాస్ సీజన్ 6 లీక్స్ కొనసాగుతున్నాయి. ప్రచారం జరిగినట్లే ఎలిమినేషన్స్ అండ్ నామినేషన్స్ ఉంటున్నాయి. నేడు సోమవారం కాగా నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నట్లు సమాచారం బయటకు వచ్చింది. 
 

bigg boss telugu 6 seven contestants nominated for elimination for this week
Author
First Published Nov 7, 2022, 1:36 PM IST

బిగ్ బాస్ ప్రేక్షకులు ఇంకా గీతూ ఎలిమినేషన్ నుండి బయటకు రాలేదు. ఈ వారం గీతూ ఎలిమినేట్ కానుందంటూ ప్రచారం జరిగింది. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న గీతూని ఎలిమినేట్ చేయరు. చేసినా ఆమెను సీక్రెట్ రూమ్ కి పంపిస్తారనే వాదన వినిపించింది. అలా జరగలేదు, గీతూను నేరుగా బయటకు పంపేశారు. ఎలిమినేటైనందుకు గీతూ ఆవేదన చెందిన తీరు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. రేవంత్ లాంటి కంటెస్టెంట్స్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఏది ఏమైనా టైటిల్ ఫెవరేట్ అనుకున్న గీతూ మధ్యలోనే బిగ్ బాస్ జర్నీ ముగిసింది. 

ఇక నేడు సోమవారం కావడంతో హౌస్లో బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. దీని సంబంధించిన ప్రోమో విడుదలైంది. రేవంత్, ఇనయాలను ఆదిరెడ్డి నామినేట్ చేశాడు. వారిద్దరితో ఆదిరెడ్డికి వాగ్వాదం జరిగింది. ఇక కీర్తి కంటెస్టెంట్ శ్రీహాన్ ని, శ్రీసత్య కంటెస్టెంట్ ఇనయాను, రేవంత్ కంటెస్టెంట్ శ్రీసత్యను నామినేట్ చేసినట్లు తెలుస్తుంది.  శ్రీసత్య-శ్రీహాన్ రిలేషన్ పై కామెంట్స్ చేసిన ఇనయా పై శ్రీసత్య ఫైర్ అయ్యారు, అది ప్రోమోలో మనం చూడవచ్చు. 

అయితే పూర్తి నామినేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. ఈ వారం మొత్తం 7 మంది నామినేట్ అయినట్లు సమాచారం అందుతుంది. టాప్ కంటెస్టెంట్స్ ఆదిరెడ్డి, రేవంత్, కీర్తి, శ్రీహాన్, ఇనయా లతో పాటు  ఫైమా, బాల ఆదిత్య ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇక రాజ్, వాసంతి, శ్రీసత్య, మెరీనా, రోహిత్ నామినేట్ కాకుండా సేవ్ అయ్యారు. ఈ క్రమంలో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది అంటున్నారు. వచ్చేవారం కూడా షాకింగ్ ఘటన జరిగే సూచనలు కలవు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios