Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6: ఎలిమినేటైన లేడీ టైగర్ ఇనయా... హౌస్లో ఆరుగురు, ఊహించని ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది!

లేడీ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఇనయా ఎలిమినేటైంది. నామినేటైన ఆరుగురు కంటెస్టెంట్స్ లో తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఇనయా హౌస్ వీడటం జరిగింది. అయితే ఫైనల్ కి ముందు మరో ట్విస్ట్ మిగిలి ఉంది. 
 

bigg boss telugu 6 inaya sulthana got eliminated and there is a big twist before grand finale
Author
First Published Dec 12, 2022, 12:37 AM IST

ప్రచారమైనట్లే ఇనయా ఫైనల్ కి ముందు వారం ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో శనివారం కీర్తి, రేవంత్ సేవ్ అయ్యారు. ఆదివారం రోహిత్, శ్రీసత్య సేవ్ కావడం జరిగింది. మిగిలిన ఆదిరెడ్డి, ఇనయాలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా... నాగార్జున ఇనయా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. వేదికపైకి వెళ్లిన ఇనయా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. నేనెవరో కూడా తెలియకుండా సప్పోర్ట్ చేశారు. ఇన్ని వారాలు హౌస్లో ఉండేలా చేశారని ఇనయా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 

అయితే ఆ ఒక్క వారం కూడా ఉండి ఫైనలిస్ట్ అనిపించుకుంటే  బాగుండేదని ఇనయా ఒకింత ఆవేదన చెందింది. స్క్రీన్ పై తన బ్యూటిఫుల్ జర్నీ చూసుకొని ఇనయా కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం హౌస్లో ఉన్న ఆరుగురు సభ్యులలోని ఒక గుడ్ క్వాలిటీ, బాడ్ క్వాలిటీ చెప్పాలని ఇనయాను నాగార్జున ఆదేశించారు. ఆరుగురు సభ్యుల గుడ్, బ్యాడ్ క్వాలిటీస్ ఇనయా చెప్పారు. నువ్వు టైటిల్ కొట్టాలని కోరుకుంటున్నాను, అని ఇనయా శ్రీహాన్ కి చెప్పడం విశేషంగా మారింది. 

ఇనయాకు సాదరంగా నాగార్జున వీడ్కోలు పలికాడు. ఆమెను పంపించి వచ్చాక విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీ, ఇతర బహుమతుల గురించి మరోసారి గుర్తు చేశాడు నాగార్జున. అనంతరం కంటెస్టెంట్స్ కి తెలియని షాకింగ్ న్యూస్ నాగార్జున కేవలం ఆడియన్స్ తో పంచుకున్నారు. అదే మిడ్ వీక్ ఎలిమినేషన్. ఫైనల్ కి ఐదుగురు సభ్యులు మాత్రమే వెళ్లాలి. ఫస్ట్ సీజన్ నుండి అది రూల్ గా ఉంది. అయితే ఈ సీజన్లో అత్యధికంగా 21 మంది కంటెస్టెంట్స్ హౌస్ కి వచ్చారు. 

ఈ క్రమంలో రెండు సార్లు డబుల్ ఎలిమినేషన్ చేసినా ఇంకా హౌస్లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున వెల్లడించారు. బుధవారం వరకు వచ్చిన ఓట్లు పరిగణలోకి తీసుకొని తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది, అన్నారు. 14వ వారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ భావించారు. అనూహ్యంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఫైనల్ వీక్ లో పెట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios