కెప్టెన్సీ టాస్క్ లో ఆదిరెడ్డి ఆట తీరును ఇనయా తప్పుబట్టింది. ఇలాగే ఇద్దరిని కెప్టెన్స్ చేసి గీతూ వెళ్ళిపోయిందంటూ ఆదిరెడ్డిపై మండిపడింది.  


హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, ఫైమా, శ్రీసత్య ఫైనల్ కి చేరారు. వీరిలో ఒకరు కెప్టెన్ కావాల్సి ఉండగా 'వస్తా నీ వెనుక' అనే గేమ్ నిర్వహించారు. నింపి ఉన్న బస్తాలు కంటెస్టెంట్స్ భుజాన తగిలించుకొని సర్కిల్ లో ఒకరి వెనుక మరొకరు తిరగాలి. కంటెస్టెంట్స్ తమ బ్యాగ్ ఖాళీగ చేయకుండా కాపాడుకుంటూ ఇతరుల బ్యాగ్స్ ఖాళీ చేయాలి. ఈ గేమ్ లో రోహిత్, మెరీనా, కీర్తి ఎలిమినేట్ అయ్యారు. చివరకు శ్రీసత్య, ఫైమా, ఆదిరెడ్డి మిగిలారు. 

ఆదిరెడ్డి శ్రీసత్య బ్యాగ్ ఖాళీ చేశాడు. అలాగే తన బ్యాగ్ శ్రీసత్య ఖాళీ చేసింది. దీంతో ఫైమా విన్నర్ గా నిలిచింది. అయితే ఆదిరెడ్డి, ఫైమా కుమ్మక్కై ఆడారని ఇంటి సభ్యులు గ్రహించారు. ఈ విషయంలో ఆదిరెడ్డిని ఇనయా నిలదీసింది. మీరిద్దరూ కలిసి ఆడారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు అంది. హౌస్లో ఒకరి సహాయం మరొకరి ఉండాలి. లేకుండా ఎవరూ ఆడలేరు అని ఫైమా ఇనయా కామెంట్స్ ఖండించింది. 

Scroll to load tweet…

ఒకప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్న ఇనయా, ఫైమా మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ క్రమంలో శ్రీసత్య బ్యాగ్ ఖాళీ చేసి ఫైమాను గెలిపించడం ఇనయాకు నచ్చలేదు. దీంతో ఆదిరెడ్డిపై తీవ్ర అసహనం ప్రదర్శించింది. ఇలాగే గీతూ ఇద్దరిని కెప్టెన్లు చేసి బయటికి వెళ్లిపోయిందని ఆదిరెడ్డిని ఎద్దేవా చేసింది. నేను హౌస్లో ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తాను. నాగార్జున తప్పు అంటే ఇంటి డోర్లు బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతా అన్నాడు. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఫైమా ఈ వారం కెప్టెన్ అయినట్లు తెలుస్తుంది. కాగా ఎలిమినేషన్ కి తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఈ వారం వెళ్లిపోనున్నారు.