Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6 : హౌస్ లోకి వెళ్లే ముందు బాల ఆదిత్యకు నాగ్ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్!

బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన బాల ఆదిత్య చంటిగాడు మూవీతో హీరోగా  మారాడు. నటుడిగా కనుమరుగైన బాల ఆదిత్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా, నాగార్జున సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. 
 

bigg boss telugu 6 hero bala aditya enters as 11th contestant in the house gets surprising gift from nag
Author
First Published Sep 4, 2022, 8:35 PM IST

తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ తెలుగు 6 నేడు ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తున్నారు. 11వ హౌస్ మేట్ గా నటుడు బాల ఆదిత్య ఎంట్రీ ఇచ్చాడు. బాల ఆదిత్య ఇంట్రో వీడియో అదిరిపోయింది. తాను రాణించిన రంగాలను ఆయన ప్రేక్షకులకు పరిచయం చేశాడు. నటుడిగా, రచయితగా, యాంకర్ గా, కంపెనీ సెక్రటరీగా బాల ఆదిత్య పలు రంగాల్లో విజయం సాధించినట్లు చెప్పుకొచ్చాడు. ఇక తన నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాస్ టైటిల్ అని చెప్పకనే చెప్పాడు. 

 ఇంట్రో వీడియో అనంతరం బాల ఆదిత్య నాగార్జునతో ముచ్చటించారు. ఆయనతో పాటు హలో బ్రదర్, వారసుడు చిత్రాలు చేసినట్లు గుర్తు చేశారు. ఏఎన్నార్ తో కూడా నటించినట్లు బాల ఆదిత్య చెప్పుకొచ్చారు. ఇక లైఫ్ లో బెస్ట్ మూమెంట్ 'అన్న' సినిమాకు నంది  అవార్డు రావడమని బాల ఆదిత్య చెప్పారు.కాగా నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా అంటే నా కూతురుకి ఎంతో ఇష్టం, ఒకసారి మీతో మాట్లాడితే కానీ అన్నం తినని మారాం చేసినట్లు బాల ఆదిత్య వెల్లడించారు. బాల ఆదిత్య కూతురితో కచ్చితంగా మాట్లాడతానని నాగార్జున హామీ ఇచ్చారు. 

చార్టెడ్ అకౌంట్ స్టూడెంట్స్ కి కూడా పాఠాలు చెబుతారట కదా, అని అడుగగా.. అవును సార్ అని బాల ఆదిత్య ఒప్పుకున్నారు. ఇక మల్టీ టాలెంటెడ్ బాల ఆదిత్య వస్తున్నాడు జాగ్రత్త అని కంటెస్టెంట్స్ ని నాగార్జున హెచ్చరించారు. చివర్లో బాల ఆదిత్యకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు నాగార్జున. ఇటీవల పుట్టిన రెండో కూతురు ఫోటోను బాల ఆదిత్యకు ఇవ్వగా చాలా ఆనందంగా, షాక్ ఫీల్ అయ్యాడు. ఇక కార్డు తీయగా నక్క గుర్తు వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios