Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6: కంటెస్టెంట్ రాజ్ కి ఘనస్వాగతం... బాణాసంచాలతో టైటిల్ విన్నర్ కి మించిన రెస్పాన్స్!


బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ రాజశేఖర్ అలియాస్ రాజ్ ప్రయాణం ముగిసింది. 12వ వారం అతడు ఎలిమినేట్ అయ్యాడు. అతనికి అభిమానుల నుండి ఘన స్వాగతం లభించింది. 

bigg boss telugu 6 eliminated contestant raj gets huge welcome from fans
Author
First Published Nov 28, 2022, 11:02 AM IST

రాజ్ ఎలిమినేషన్ ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకున్నారు. మోస్ట్ జెన్యూన్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. రాజ్ ఎలిమినేషన్ లాజిక్ లేకుండా అడ్డదిడ్డంగా జరిగింది. ఫైమా కంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఎలిమినేట్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. నామినేషన్స్ ఉన్న సభ్యుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని మాత్రమే ఎలిమినేట్ చేయాలనేది రూల్. ఇక్కడ అత్యల్పంగా ఓట్లు తెచ్చుకున్న ఫైమా ఎవిక్షన్ పాస్ తో సేవ్ అయ్యింది. ఆమె కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రాజ్ ని లెక్క ప్రకారం ఎలిమినేట్ చేయాల్సింది కాదు. 

గతంలో ఇదే పరిస్థితి తలెత్తింది. సీజన్ 4 లో అరియనా-అవినాష్ డేంజర్ జోన్లోకి వచ్చారు. ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అయితే అవినాష్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది. అది తన కోసం వాడుకున్నాడు. రిజల్ట్ లో అవినాష్ ఎలిమినేట్ కాగా అరియనా సేవ్ అయ్యింది. దీంతో ఇద్దరూ సేవ్ అయ్యారు. సీజన్ 6 కి వచ్చేసరికి రూల్ మారిపోయింది. గత సీజన్స్ లో బిగ్ బాస్ నిర్వాహకులు పెట్టిన రూల్స్, కండిషన్స్, సందర్భాలు కూడా వారు మర్చిపోతున్నారని తాజా ఘటనతో తెలిసింది . 

ఏది ఏమైనా రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. అతడిపై ప్రేక్షకుల్లో జీరో నెగిటివిటీ ఉంది. బహుశా ఇన్ని సీజన్స్ లో బిగ్ బాస్ హౌస్ నుండి క్లీన్ ఇమేజ్ తో బయటికి వచ్చిన కంటెస్టెంట్ రాజ్ మాత్రమే కావచ్చు. దీంతో అతనికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. టైటిల్ విన్నర్ కి మించిన వెల్కమ్ రాజ్ కి దక్కింది. అభిమానుల స్వాగతానికి రాజ్ మురిసిపోయాడు. అందరికీ అభివందనం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios