గీతూ రాయల్ ని సీరియల్ నటి కీర్తి భట్ కుక్కతో పోల్చింది. కుక్కలు మొరిగినంత మాత్రాన మన విలువ తగ్గదు అన్న అర్థంలో ఆమె మాట్లాడారు. కెప్టెన్సీ టాస్క్ చేపల చెరువు రసాభాసగా మారింది.
ప్రస్తుతం హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇంటి సభ్యులను జంటలుగా విడదీసి చేపల చెరువు టాస్క్ లో పోటీపడాలని బిగ్ బాస్ సూచించారు. జంటలు గాలిలో నుండి పడే బొమ్మ చేపలను సేకరించాలి. రౌండ్ ముగిసేనాటికి ఏ జంట దగ్గర తక్కువ చేపలు ఉంటే వారు ఎలిమినేట్ అవుతారు. ఫస్ట్ రౌండ్ లో గీతూ-ఆది రెడ్డి ఎలిమినేట్ అయ్యారు. వీరిద్దరూ తక్కువ చేపలు సేకరించడంతో కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పుకున్నారు. టాస్క్ నుండి తప్పుకున్నా గీతూ ఆట ఆపలేదు. అందరూ పడుకున్నాక.. గీతూ ఇతర జంటలు సేకరించిన చేపలు దొంగిలించే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని మెరీనా గమనించారు.
ఉదయాన్నే ఆమె ఆ విషయం ఇంటి సభ్యులతో చెప్పింది. ఇది గీతూకి నచ్చలేదు. నువ్వు గేమ్ ఆడవు, ఆడే వాళ్లను ఆడనీయవు. నా పాటికి నేను ఏదో చేసుకుంటున్నా కదా. ఎందుకు చెప్పావని నిలదీసింది. అది నా ఇష్టం అని మెరీనా సమాధానం చెప్పింది. ఆటలో ఓడిపోయి అసహనం చూపిస్తున్నావని కోప్పడింది. నేను ఆటలో ఉన్నా లేకపోయినా ఇలానే మాట్లాడతానని గీతూ అన్నది.
మెరీనా ఈ విషయం కీర్తికి చెప్పింది. గీతూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తుంది. టార్గెట్ చేసిన వాళ్లపై పడిపోతుందని ఆక్రోషం వెళ్లగక్కింది. మెరీనా మాటను అందుకుంటూ కీర్తి... కన్నడలో ఒక కొటేషన్ ఉంది. కుక్కలు మొరిగితే దేవలోకానికి వచ్చిన నష్టం ఏమీ లేదట, అని చెప్పింది. ఇక్కడ కీర్తి గీతూని కుక్కతో పోల్చింది. గీతూ అరవడం వలన మెరీనా విలువేమీ తగ్గదు అన్న అర్థంలో మాట్లాడింది. మరి ఈ విషయం గీతూ వరకు చేరితే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
చేపల చెరువు టాస్క్ ఆడేటప్పుడు కూడా మెరీనా-రోహిత్ ల గేమ్ పట్ల గీతూ ఫైర్ అయ్యారు. కలిసి ఆడుతున్నారని కోప్పడింది. బిగ్ బాస్ వేరు వేరుగా ఆడాలని చెప్పినా కూడా మీరు కలిసి ఆడుతున్నారంటూ మండిపడింది. ఈ విషయంలో మెరీనా-గీతూ మధ్య వాడివేడి సంభాషణ నడిచింది.
