యంగ్ ఫెలో అర్జున్ వచ్చినప్పటి నుండి ఎవరిని బుట్టలో వేసుకుందామా అనే ఆలోచనలో ఉంటున్నాడు. గేమ్, టాస్క్స్ పట్ల పెద్దగా ఫోకస్ పెట్టకుండా అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడు.  

బిగ్ బాస్ హౌస్ లో లవ్ ఎఫైర్స్ కి లవర్స్ కి మంచి డిమాండ్ ఉంది. స్పైసీ కంటెంట్ ఇచ్చే ప్రేమ జంటలకు మైలేజ్ ఉంటుంది. ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా నిర్వాహకులు హౌస్ లో కొనసాగిస్తారు. హిస్టరీ చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. కొందరు లవర్ బాయ్స్ అయితే టైటిల్స్ కూడా అందుకున్నారు. అభిజీత్, రాహుల్ సిప్లిగంజ్ హౌస్ లో ప్రేమ కథలు నడిపి టైటిల్స్ సొంతం చేసుకున్నారు. ఇదే ఫార్ములాతో సక్సెస్ కావాలనుకుంటున్నాడు సీజన్ 6 కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్. 

వచ్చినప్పటి నుండి కంటెస్టెంట్ శ్రీసత్యకు లైన్ వేస్తున్నాడు. ఆమెకు సేవలు చేసి ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నాడు. హోటల్ టాస్క్ లో డబ్బులు మొత్తం శ్రీసత్యకు ఇచ్చేశాడు. దాంతో అర్జున్ గేమ్ మధ్యలోనే ముగిసింది. ఇక కీలకమైన నామినేషన్ ప్రక్రియలో తాను నామినేటై శ్రీసత్యను సేవ్ చేశాడు. ఇంత చేసినా శ్రీసత్య పూర్తి స్థాయిలో అర్జున్ ని ఇష్టపడటం లేదు. అందరితో ఉన్నట్లే అర్జున్ తో కూడా ఉంటుంది. శ్రీసత్య తనకు దగ్గరవుతుందన్న నమ్మకం అర్జున్ లో పోయింది. 

దీంతో వాసంతి వైపుకు తిరిగాడు. ఆమెను లైన్లో పెట్టాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. వాసంతి కూడా అర్జున్ అంటే ఇష్టం చూపిస్తుంది. అతనితో సన్నిహితంగా ఉంటుంది. గత ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వాసంతితో అర్జున్ ప్రేమ వ్యవహారాలు మాట్లాడాడు. మనం ఒక ట్రై యాంగిల్ లవ్ సెట్ చేద్దాం అన్నాడు. ఎలా అని వాసంతి అడగ్గా... నేను శ్రీసత్యకు ట్రై చేస్తూ ఉంటాను. నువ్వు నా వెనకపడు అన్నాడు. ఆ విధంగా మనం ట్రై యాంగిల్ స్టోరీ నడుపుదాం అన్నాడు. అర్జున్ ప్రపోజల్ వాసంతికి నచ్చలేదు. నేను నీ వెంటపడితే నువ్వు శ్రీసత్య వెనుకబడతావా? అంటూ విసుక్కుంది.

అర్జున్ తెలివిగా ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్ చేయాలనుకుంటున్నాడు. కాగా ఈ వారం ఎలిమినేషన్ లో వాసంతి, అర్జున్ ఇద్దరూ ఉన్నారు. వీరిద్దరితో పాటు ఆదిరెడ్డి, చంటి, బాల ఆదిత్య, ఇనయ, మెరీనా, ఫైమా నామినేట్ కావడం జరిగింది. ఇక గత నాలుగు వారాల్లో షాని, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు ఎలిమినేట్ అయ్యారు. ఈ ఆదివారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూడాలి.