కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు షో గ్రాండ్ గా లాంచ్ అవుతోంది.

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు షో గ్రాండ్ గా లాంచ్ అవుతోంది. నాగార్జున ఇప్పుడే హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ని సరికొత్తగా డిజైన్ చేశారు. హౌస్ లోకి ఒక్కో కంటెస్టెంట్ ప్రవేశం నెమ్మదిగా మొదలయింది. మొదటి కంటెస్టెంట్ గా యూట్యూబర్ సిరి ప్రవేశించింది. 

ఇక రెండవ కంటెస్టెంట్ గా బుల్లితెర సీరియల్ నటుడు విజయ్ సన్నీ ఎంటర్ అయ్యాడు. అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలోని టైటిల్ సాంగ్ తో విజయ్ సన్నీ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. 

నాగార్జున అతడితో సరదాగా ముచ్చటించాడు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావో బొమ్మ గీసి చూపించు అని నాగ్ విజయ్ ని అడిగాడు. దీనితో విజయ్ ఫన్నీగా ఉండే అమ్మాయి బొమ్మ గీశాడు. 

ఇక విజయ్ హౌస్ లోకి ఎంటర్ కాగానే పులిహోర మొదలు పెట్టేశాడు. ఆల్రెడీ హౌస్ లో ఉన్న సిరితో మాట మాటా కలిపాడు. ఇద్దరూ కలసి హౌస్ లో ఉన్న విశేషాలను చూశారు.