Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గతసీజన్ల కంటే ఎక్కువ రచ్చను క్రియేట్ చేస్తోంది. నామినేషన్ల ప్రక్రియ సమయంలో గోడవలు హద్దులు దాటుతున్నాయి. రోహిత్, వంశీ కొట్టుకునే పరిస్థితి క్రియేట్ అయ్యింది. త్రిగుణ్ రోహిత్ పై నోరు జారాడు కూడా.

రసవత్తరంగా నామిరేషన్లు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. రోజురోజుకు షోలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కంటెస్టెంట్లు ఎవరికివారే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుండటంతో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. తాజా ఎపిసోడ్ ఆధారంగా చూస్తే, హౌస్‌లో మాటల యుద్ధం కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది. ముఖ్యంగా షాలినీ, రోహిత్ జంటకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నీతూ నటరాజ్‌కు మధ్య జరుగుతున్న వివాదాలు షోలో హాట్ టాపిక్‌గా మారాయి.

నామినేషన్స్‌లో తారాస్థాయికి చేరిన వేడి

ఆరో వారం నామినేషన్ల ప్రక్రియను బిగ్ బాస్ ఎంతో ఆసక్తికరంగా డిజైన్ చేశారు. 'రోడ్ బ్లాక్' పేరుతో నిర్వహించిన ఈ ప్రక్రియలో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. సోమవారం - మంగళవారం నాటి ఎపిసోడ్లలో కంటెస్టెంట్ల మధ్య జరిగిన వాగ్వాదాలు చూస్తుంటే ఈ వారం ఆట మరింత రసవత్తరంగా మారనుందని అర్థమవుతోంది. దేబ్జానీ, షాలినీ, వంశీ, రోహిత్ తదితరుల మధ్య జరిగిన డిస్కషన్స్ తీవ్ర రూపం దాల్చాయి. తోటి కంటెస్టెంట్ల ఆట తీరును ప్రశ్నిస్తూ, నామినేషన్లకు సరైన కారణాలు చెబుతున్నామని వాదిస్తున్నా, అది వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారడం ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

షాలినీ, రోహిత్ వర్సెస్ నీతూ మాస్టర్

మంగళవారం ఎపిసోడో లో దేబ్జానీ - షాలినిని నామినేట్ చేయగా.. వారిద్దరిమధ్య వాగ్వాదం జరిగింది. అందులో రోహిత్ ఎంటర్ అవ్వడంతో అది పెద్ద గొడవగా మారింది. దేబ్జానీ షాలినీతో పాటు రామ్ ప్రసాద్ ను కూడా నామినేట్ చేసింది. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నీతూ నటరాజ్‌పై షాలినీ ‌- రోహిత్ జోడి మొదటి నుంచి కొంత కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలో స్టేజ్ మీద నీతూ మాట్లాడిన కొన్ని మాటలు తనను హర్ట్ చేశాయని షాలినీ అప్పుడే భావించింది. అప్పటి నుంచి హౌస్‌లో నీతూను ఏ చిన్న అవకాశం దొరికినా టార్గెట్ చేయడం, ఆమె చేసే పలకరింపులను లేదా మాటలను వెటకారంగా తీసుకోవడం చేస్తూ వస్తున్నారు. రోహిత్ కూడా షాలినీకి మద్దతుగా నిలుస్తూ నీతూపై కౌంటర్లు వేయడం గమనించవచ్చు.యతాజా నామినేషన్ల ప్రక్రియలో ఈ పాత కక్షలు మరింత బహిర్గతమయ్యాయి. నీతూ మాట్లాడిన ప్రతిసారీ షాలినీ కావాలని ఆమెను చిన్నచూపు చూసేలా ప్రవర్తించడం వివాదానికి దారి తీసింది.

కొట్టుకునే వరకు వెళ్లిన గొడవ

నామినేషన్ల సమయంలో షాలినీ - వంశీ మధ్య జరిగిన మాటల యుద్ధం హద్దులు దాటింది. ఒకరినొకరు ఇమిటేట్ చేసుకుంటూ, తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో వివాదంలోకి రోహిత్ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మరింత చేయి దాటిపోయింది. "మర్యాద ఆశిస్తే ముందు మీరు మర్యాదగా ఉండండి" అంటూ రోహిత్ మాట్లాడగా, వంశీ తీవ్రంగా స్పందించారు. వ్యక్తి పక్కనే ఉంటేనే ఇంత చులకనగా మాట్లాడుతున్నావంటే, లేకపోతే ఇంకెన్ని అంటావంటూ వంశీ మండిపడ్డారు. ఈ వాగ్వాదం ముసరుకుని ఇద్దరూ ఒకరిపైకి ఒకరు దూసుకువెళ్లి కొట్టుకునేంత పని చేశారు. తోటి హౌస్‌మేట్స్ వచ్చి వారిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

నీతూ సీరియస్ ఎంట్రీ.. రోహిత్‌ను నెట్టివేసిన వైనం

ఈ గొడవ మధ్యలోకి నీతూ వచ్చి షాలినీ పేరు పెట్టి పిలవడంతో, షాలినీ ఆమెను ఎంతో చిన్నచూపుతో, నిర్లక్ష్యంగా మాట్లాడింది. "మిమ్మల్ని అసలు ఎవరు పిలిచారు?" అంటూ షాలినీ చేసిన వ్యాఖ్యలు నీతూకు తీవ్ర కోపాన్ని తెప్పించాయి. "మనుషులకు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నీకు తెలియదా?" అంటూ నీతూ నిలదీశారు. దీనికి షాలినీ మరింత విచిత్రమైన సైగలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నీతూ వేగంగా వచ్చి రోహిత్‌ను తోసేయడం హౌస్‌లో ప్రకంపనలు సృష్టించింది.

రోహిత్ ది రొట్టగ్యాంగ్.. త్రిగుణ్ సంచలన కామెంట్స్..

త్రిగుణ్ రోహిత్ ను నామినేట్ చేస్తూ.. సంచలన కామెంట్స్ చేశారు. రోహిత్ వల్లనే సృష్టి, అపూర్వ, చరణ్ లు బయటకు వెళ్ళారని ఆరోపించాడు. అంతే కాదు రోహిత్ ఏదో మాట్లాడబోయినా.. వినకుండా రోహిత్ రొట్ట గ్యాంగ్ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. మొత్తానికి ఆరో వారం నామినేషన్లు కేవలం ఆట వరకే పరిమితం కాకుండా వ్యక్తిగత రచ్చకు దారితీశాయి. దాదాపు హౌస్ లో ఉన్న అందరు షాలినిని, రోహిత్ ను టార్గెట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో అందరు ఒక వైపు.. రోహిత్, షాలినీ మాత్రం కార్నర్ అయ్యారు. ఈ వారం షాలినీ, రోహిత్ తో పాటు వర్షిణి, వంశీ, అమన్, రామ్ ప్రసాద్ బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారు. కంటెస్టెంట్లు ఇలాగే హద్దులు మీరి ప్రవర్తిస్తే రాబోయే వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున నుంచి గట్టిగానే క్లాస్ పడే అవకాశం ఉంది. ఈ వివాదాలు రాబోయే రోజుల్లో హౌస్ సమీకరణాలను ఎలా మారుస్తాయో వేచి చూడాలి.