బిగ్ బాస్ రేస్ టు ఫినాలే టాస్క్ ప్రారంభించారు. ఇంటిలో ఉన్న ఏడుగురు సభ్యులలో ఒకరు నేరుగా ఫైనల్ కి వెళ్లే అవకాశం ఇచ్చాడు. దశల వారీగా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో పాల్గొని, ఎవరికీ ఎవరూ తక్కువ కాదన్నట్లు పోటీపడి గెలిచే ప్రయత్నం చేయాలన్నారు. బిగ్ బాస్ నిర్వచించే టాస్క్ లో గెలిచి నిలచినవారు, నేరుగా ఫైనల్ కి వెళ్లడానికి ఫినాలే మెడల్ గెలుచుకోవచ్చని చెప్పారు. 

ఇంటిలో పోరు మరింత రసవత్తరంగా మారనుందని ఇంటి సభ్యులకు అర్థం అయ్యింది. ఏది చేసైనా గెలిచే ప్రయత్నమా చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో, మనమందరం వైల్డ్ గా మారబోతున్నామని ఆరియానా, అవినాష్ తో చెప్పడం విశేషం. రేస్ టు ఫినాలే మెడల్ కోసం  నిర్వహించిన మొదటి టాస్క్ పాలు సేకరించడం. గార్డెన్ ఏరియాలో ఉంచిన ఆవు బొమ్మ నుండి బజర్ మోగిన ప్రతిసారి పాలు సేకరించాలని చెప్పాడు. 

అలా మూడు బజర్స్ మోగే సరికి ఎవరు తక్కువ పాలు సేకరిస్తారో, వాళ్ళు నెక్స్ట్ లెవల్ కి వెళ్ళరు అన్నారు. అత్యధిక బాటిల్స్ ని పాలతో నింపిన నలుగురు మాత్రమే నెక్స్ట్ లెవెల్ కి వెళతాడని చెప్పారు. ఈ టాస్క్ లో ఆవు నుండి పాలు సేకరించడానికి ఇంటి సభ్యులు పోటీపడ్డారు. ఒకరినొకరు తోసుకోవడం, నెట్టుకోవడం చేసుకున్నారు.