విజయవంతంగా ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పుడిప్పుడే మరింత రంజుగా మారుతుంది. ఎలిమినేషన్స్ పెరుగుతున్న నేపథ్యంలో మిత్రులుగా ఉన్న వారు కూడా శత్రువులుగా మారుతున్నారు. కాగా ఎలిమినేట్ కాకుండానే ఆరోగ్య కారణాలతో బయటికి వచ్చేశాడు నోయల్. హౌస్ నుండి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటి నుండి బయటికి వచ్చిన సభ్యుల మనో భావాలు, అనుభవాలు, ఇంటి సభ్యులపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. 

ఇక నోయల్ ని కూడా రాహుల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటి సభ్యులు ప్రతి ఒక్కరి గురించి ఒక ప్లస్ పాయింట్ నెగిటివ్ పాయింట్ చెప్పాలని రాహుల్ అడిగారు. ఇంటి సభ్యులందరిలో పాజిటివ్, నెగిటివ్ అంశాలు చెప్పిన నోయల్ మోనాల్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమె మొదట్లో అభిజిత్ తో బాగుండేది, ఆమె ప్రవర్తన, మాట నిలకడ లేని తనం చూసి అభిజిత్ దూరం పెట్టాడు. తర్వాత అఖిల్ కనెక్ట్ అయ్యాడు అన్నాడు. 

మోనాల్ ఎవరికీ అర్థం కాదు, ఆమెను అర్థం చేసుకోవడం సముద్రాన్ని ఈదడం ఒకటే అన్నాడు. అందరినీ కన్ప్యూజ్ చేయడం ఆమె గేమ్ కావచ్చు. చిన్న చిన్న విషయాలకు ఏడ్చేస్తుందని చెప్పాడు. ఐతే రాహుల్ కూడా ఆమెపై నెగెటివ్ ఒపీనియన్స్ వచ్చేలా నోయల్ మాటలకు ఊతం అందించాడు. 

ఎలిమినేటై వచ్చిన ప్రతి ఒక్కరు మోనాల్ పై నెగెటివ్ కామెంట్స్ చేసేలా మోనాల్ పై రాహుల్ ప్రశ్నలు ఉంటున్నాయని మోనాల్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మోనాల్ ఇంటిలో ఉండడం ఇష్టం లేని రాహుల్, ఎలిమినేటైన సభ్యులు ఆమె గురించి చెడుగా చెప్పేలా ప్రేరేపిస్తున్నాడు అనేది వారి భావన. దీనిని వారు సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి నిజంగా వారి ఆరోపణలలో నిజం ఉంటే...అది ఎందుకు అనేది తెలియాల్సి ఉంది.