బిగ్ బాస్ ఓటీటీ (Bigg boss OTT) చివరి దశకు చేరుకుంది. ఓ వర్గం ప్రేక్షకులను ఈ షో బాగానే ఎంటర్టైనర్ చేస్తుంది. ఇక మరో వీకెండ్ సమీపిస్తుండగా ఎవరు ఎలిమినేట్ కానున్నారనే ఉత్కంఠ మొదలైంది. అయితే ఈ వారం అనూహ్యంగా ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ హౌస్ ని వీడొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  


ఈ వారం నామినేషన్స్ లో యాంకర్ శివ, అనిల్ రాథోడ్, నటరాజ్ మాస్టర్, బాబా భాస్కర్, అరియనా, మిత్ర శర్మ, హమీద ఉన్నారు. ఈ ఏడుగురు కంటెస్టెంట్స్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఈ ఎలిమినేషన్ ఉంటుంది. మరి నామినేషన్స్ లో ఉన్న ఏడుగురు సభ్యుల బలాబలాలను బట్టి ఈ వారం ఆ ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయన్న మాట వినిపిస్తుంది. 

నామినేషన్స్ లో ఉన్నవారిలో యాంకర్ శివ చాలా స్ట్రాంగ్, అతనికి ప్రేక్షకుల నుండి మంచి సపోర్ట్ అది. అదే సమయంలో షోలో ఎంటర్టైనర్ గా ఉన్నారు. ఈ నామినేషన్స్ లో వారిలో నటరాజ్ మాస్టర్, మిత్రా శర్మలపై కొంత నెగిటివిటీ ఉంది. అయితే వాళ్ళు గత టాస్క్స్ లో మంచిగా పెర్ఫార్మ్ చేసి అనూహ్యంగా పుంజుకున్నారు. నటరాజ్ మాస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ కి రావడం ఆయనకు సింపతీ వచ్చి చేరింది. ఇక అనిల్ రాథోడ్, బాబా భాస్కర్ కూడా సేఫ్ అన్న ప్రచారం జరుగుతుండగా... అరియనా, లేదా హమీదా ఎలిమినేట్ కావచ్చంటున్నారు. 

అరియనా (Ariyana)అతివిశ్వాసం ఆమె అవకాశాలు దెబ్బతీసిందని, అలాగే హమీదా(Hamida) సైతం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. కాబట్టి ఈ వారం వారిద్దరిలో ఒకరు, లేదా ఇద్దరు కూడా ఎలిమినేట్ కావచ్చని అంటున్నారు. అదే జరిగితో రెండోసారి డబుల్ ఎలిమినేషన్ అవుతుంది. హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ తో పాటు స్రవంతి ఓ వారం ఎలిమినేట్ కావడం జరిగింది. మరి రెండు రోజుల్లో ఎలిమినేషన్ ఉండగా, ఎవరు హౌస్ వీడనున్నారో చూడాలి.