బిగ్ బాస్ సీజన్ 3 ఏడో వారం పూర్తి చేసుకోబోతుంది. గురువారం రాత్రి జరిగిన కెప్టెన్‌ టాస్క్‌తో విజేతగా నిలివడంతో బాబా భాస్కర్ ఏడో వారంలో హౌస్‌కి కెప్టెన్ అయ్యారు. శుక్రవారం ఎపిసోడ్ లో బాబా భాస్కర్ తనదైన స్టైల్‌లో కెప్టెన్‌గా కామెడీ మార్క్ చూపించారు. 'గర్ల్స్ అండ్ బాయ్స్.. ఆంటీ అండ్ అంకుల్స్..' అంటూ కంటెస్టెంట్స్ అందర్నీ కూర్చోబెట్టి ఫన్నీగా మాట్లాడారు.

అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటూ.. మీకు నిద్ర వస్తే పడుకోండి.. కుక్కలు మొరగ్గానే లేచి వచ్చేయండి. మీకు దమ్ము ఉంటే ఇంగ్లీష్‌లో మాట్లాడండి... ఒక్కొక్కరికీ కండిషన్స్ పెడుతూ.. బ్యాలన్స్ ఉన్నశ్రీముఖిని తన పర్సనల్ అసిస్టెంట్‌గా అనౌన్స్ చేశారు. బాబా, శ్రీముఖిల మధ్య కామెడీ బాగా పండింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తో ఫన్నీ టాస్క్ ఆడించిన బిగ్ బాస్ వారికొక సర్ప్రైజ్ కూడా ఇచ్చారు.

కంటెస్టెంట్స్ కోసం తమ ఇంటి సభ్యులు పంపిన సందేశాలను బిగ్‌బాస్‌.. హౌస్ మేట్స్ కి అందించారు. ఇక వాటిని చదువుకుంటూ ప్రతీ ఒక కంటెస్టెంట్‌ ఆనందంతో కన్నీరుపెట్టారు. రాత్రి పడుకునే ముందు వరుణ్, వితికా, రాహుల్, పునర్నవిల మధ్య ఒక టాపిక్ నడిచింది. ముందు వితికా.. రాహుల్ ని 'నీకు నిజంగా పునర్నవి మీద ఫీలింగ్స్ లేవా..?' అని ప్రశ్నించింది.

దానికి రాహుల్ తనకు పునర్నవి అంటే ఇష్టమని కానీ మరో ఉద్దేశం లేదని తేల్చి చెప్పాడు. నిజంగానే తనకు ఒకరు నచ్చితే ధైర్యంగా ప్రపోజ్ చేస్తానని చెప్పాడు. అలానే పునర్నవిని రాహుల్ గురించి ప్రశ్నించగా.. తనకు రాహుల్ అంటే ఇష్టమే కానీ తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పింది. ఇంతలో రాహుల్ 'ఐలవ్యూ నవి' అని సరదాగా చెప్పాడు. వరుణ్ మరోసారి గుచ్చి గుచ్చి పునర్నవిని అడగడంతో తను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చింది పునర్నవి.