బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంటుండగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర పోటీ మొదలైంది. ఇంటిలో ప్రస్తుతం అభిజిత్, అఖిల్, హారిక, ఆరియానా, అవినాష్, మోనాల్, హారిక మరియు లాస్య ఉన్నారు. ఈ ఎనిమిదిమంది  ఇంటి సభ్యులలో ఆరుగురు సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. 

లాస్య, అభిజిత్, హారిక, ఆరియానా, మోనాల్ మరియు సోహైల్ ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఈ ఆరుగురిలో ఎవరు ఈ వారం హౌస్ నుండి దూరం కానున్నారనేది ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల ముందే బిగ్ బాస్ ఎలిమినేషన్ పై లీకులు వస్తుండగా ఈ వారం లాస్య ఎలిమినేటైనట్లు తెలుస్తుంది. 

మొదటి నుండి సేఫ్ గేమ్ ఆడుతున్న లాస్యపై నెగెటివిటీ పెరిగిపోయిందని సమాచారం. సేఫ్ గేమ్, ఫేక్ స్మైల్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న లాస్యకు ఈ వారం తక్కువ ఓట్లు దక్కాయట. హౌస్ లో వంట మనిషిగా బాధ్యతలు నిర్వహించడం మినహా లాస్య తన ప్రత్యేక చాటడం లేదు. 

అందరితో బాగుంటూ నామినేషన్స్ నుండి ఎక్కువగా తప్పించుకుంటూ వచ్చిన లాస్య ఈ వారం హౌస్ విడినట్లు సమాచారం. లాస్య ఎలిమినేషన్ తో ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంటిని వీడినట్లు అయ్యింది. ఆదివారం దీనిపై పూర్తి స్పష్టత రానుంది.