బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ కి ఎంపికైన సభ్యులలో చాల మంది ఎలిమినేటై వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది సభ్యులు మాత్రమే వున్నారు. వీరిలో లాస్య, మోనాల్, ఆరియానా, అభిజిత్, సోహైల్ మరియు హారిక నామినేషన్స్ లో ఉన్నారు. వీరి నుండి ఈ ఆదివారం ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారు. కాగా ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన టాస్క్ లో అభిజిత్, అఖిల్, హారిక గెలుపొందడం జరిగింది. 

ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం కెప్టెన్ కానున్నాడు. ఈ ముగ్గురిలో ఒకరు కెప్టెన్ కావల్సి ఉండగా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ కి ఎంపికైన ముగ్గురు ఇంటి సభ్యులలో వారికి నచ్చిన ఒకరి భుజాలపై కూర్చోవాలని, ముగ్గురిలో ఎక్కువ సేపు భుజాలపై కూర్చున్న వారు కెప్టెన్ అవుతారని చెప్పడం జరిగింది. 

దీని కోసం అఖిల్ సోహైల్ భుజాలపై కూర్చోగా, అభిజిత్ ని అవినాష్ ఎక్కించుకున్నాడు. ఇక హారిక లేడీ కావడంతో ఆమె మోనాల్ భుజాలపైకి ఎక్కింది. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ సేపు వాళ్ళ భుజాలపై ఉంటారో వాళ్లే విన్నర్ అవుతారు. ఐతే కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న వారు ఇతర ఇంటి సభ్యుల భుజాలపై కూర్చోవడం విశేషం. అంటే వీరి గెలుపు ఎక్కించుకున్న ఇంటి సభ్యుడు స్టామినాపై ఆధారపడి ఉంటుంది. 

అఖిల్ ని సోహైల్, హరికను మోనాల్, అభిజిత్ ని అవినాష్ ఎక్కువ సేపు మోయగలగాలి. వీరిలో ఎవరు వీక్ అయితే వాళ్ళ భుజాలపై కూర్చున్న వారు ఓడిపోతారు. మరి ఈ టాస్క్ లో ఎవరు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.