బిగ్ బాస్ సన్నీ డెబ్యూ వెబ్ సిరీస్ భారీ ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో ఆయనకు బ్రేక్ వచ్చిందంటున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో పెద్ద మొత్తంలో వ్యూస్ రాబడుతోంది.

బిగ్ బాస్ ఫేమ్ సన్నీ నటించిన ఏ టి ఎం వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ దక్కుతుంది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఏ టి ఎం సిరీస్ కి కథను అందించడం విశేషం. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన నేపథ్యంలో మరింత హైప్ సొంతం చేసుకుంది. ప్రోమోలతో ఆకట్టుకున్న ఏ టి ఎం అంచనాలు అందుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో పెద్ద మొత్తంలో వ్యూస్ రాబడుతోంది. సన్నీ, సుబ్బరాజ్, దివి కీలక రోల్స్ చేశారు. జనవరి 20 నుండి జీ 5లో ఏ టి ఎం స్ట్రీమ్ అవుతుంది.

ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ థ్రిల్లర్ ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇది ఇప్పటి వరకు50 మిలియన్స్ స్ట్రీమింగ్‌ మినిట్స్ కి రీచ్‌ రావడం విశేషం. దీంతో తెలుగు ఆడియన్స్ లో ఏ టి ఎం సిరీస్ గురించి చర్చ నడుస్తుంది. కాగా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న విజే సన్నీ టైటిల్ అందుకున్నారు. ఫైనల్ లో అతడు షణ్ముఖ్ జస్వంత్ తో పోటీపడ్డారు. మొదటి నుండి తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నీ టైటిల్ విన్నర్ అయ్యారు. 

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా అతడు ఫేమ్ రాబట్టారు. అతడికి వెండితెర ఆఫర్స్ పెరిగాయి. సకల గుణాభి రామ టైటిల్ తో ఓ చిత్రం చేశారు. అది అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. సెకండ్ అటెంప్ట్ వెబ్ సిరీస్ తో ఆయన సక్సెస్ కొట్టారు. ఏ టి ఎం సన్నీ ఇమేజ్ కి ప్లస్ అయ్యింది. కాగా సన్నీ గతంలో సీరియల్స్ లో నటించారు. సీరియల్ నటుడిగా అతడికి బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కింది.