బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ మోనాల్ క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఐటెం పాపగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పక్కన స్టెప్స్ వేయనున్నారని సమాచారం అందుతుంది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ అనే మూవీ చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉండగా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

కాగా ఈ మూవీలో ఓ ఐటెం సాంగ్ కోసం మోనాల్ ని తీసుకున్నారట. 
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ లో సాయి శ్రీనివాస్ కి జంటగా ఆమె స్టెప్స్ వేయనున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. దీనితో సినిమాపై మరింత హైప్ వచ్చి చేరింది. బిగ్ బాస్ హౌస్ లో 14వారాలున్న మోనాల్ తన మార్క్ గ్లామర్ షోతో ఆకట్టుకున్నారు. అఖిల్ తో మోనాల్ లవ్ స్టోరీ హైలెట్ అయ్యింది. 

ఇక అల్లుడు అదుర్స్ చిత్రాన్ని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. నభా నటేష్ మరియు అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోనూ సూద్ కీలక రోల్స్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న అల్లుడు అదుర్స్ మూవీ విడుదల కానుంది.